టీడీపీ పాలనలోనే కుప్పం అభివృద్ధి

ABN , First Publish Date - 2022-09-24T04:44:08+05:30 IST

కుప్పం నియోజకవర్గం అన్ని విధాల వెనుకబడి ఉండటంతో పాటు అనధికార ఏజెన్సీగా ఉన్న ప్రాంతాన్ని సీఎంగా చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారన్నారు.

టీడీపీ పాలనలోనే కుప్పం అభివృద్ధి
విలేకరులతో మాట్లాడుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

పుంగనూరు రూరల్‌, సెప్టెంబర్‌ 23: టీడీపీ పాలనలోనే కుప్పం నియోజకవర్గం అభివృద్ది చెందినట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పూరి రమేశ్‌, రాజంపేట ఉపాధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం అన్ని విధాల వెనుకబడి  ఉండటంతో పాటు అనధికార ఏజెన్సీగా ఉన్న ప్రాంతాన్ని  సీఎంగా చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కుప్పాన్ని అభివృద్ది చేయడానికి ప్రత్యేక అధికారుల ఏర్పాటు చేసి రాష్ట్రంలో గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు.  ద్రావిడ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌ కళాశాల, మెడికల్‌ కాలేజీ, పాలిటెక్నిక్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇజ్రాయేల్‌ దేశ పరిజ్ఞానంతో వ్యవసాయం, బిందుసేద్యం, పాలీహౌస్‌, గ్రీన్‌హౌస్‌ తదితర వాటిని దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశారని తెలిపారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు హిమాద్రి, ఇమ్రాన్‌, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధి జరగలేదనడం హాస్యాస్పదం


రామకుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని సీఎం జగన్‌ పేర్కొనడం హాస్యాస్పదమని టీడీపీ రామ కుప్పం మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహులు, మాజీ అధ్యక్షుడు ఆంజ నేయరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు  మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ వ్యాఖ్యలపై  మండి పడ్డారు. కుప్పం నియోజకవర్గం పనిష్మెంట్‌ ఏరియా గా పిలవబడేదన్నారు. అటువంటి ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో పయనింప జేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. పాలారు నదిపై 45 చెక్‌డ్యాంలు, అన్ని గ్రామాల్లో రక్షితతాగునీటి పథకాలు, ప్రతి గ్రా మానికి తారురోడ్లు, వీధివీధిలో  సి మెంటు రోడ్లు నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కు తుందన్నారు. దేశం లోనే ప్రప్రథమంగా ఇజ్రాయేల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని కుప్పంలో అమలు చేసి బిందు, తుంపర్ల సేద్యాన్ని రైతులు అలవర్చుకునేలా చేశా రన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలు, కుప్పం డిగ్రీ కళాశాల, నాలుగు మండలాల్లో జూనియర్‌ కళాశాలు, ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసింది చంద్రబాబు కాదా అని వారు ప్రశ్నించారు. కుప్పంలో 5000 మందికి ఉపాఽధి కల్పిస్తున్న షాహీగార్మెంట్స్‌ ఎప్పుడు ఏర్పాటయ్యిందో సీఎంకు తెలీదా అని కూడా వారు ప్రశ్నించారు. రూ.450 కోట్లతో హంద్రీ-నీవా సుజల స్రవంతి కుప్పం కెనాల్‌ 90శాతం పనులు టీడీపీ హయాంలో పూర్తికాగా, వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్ళయినా మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయక పోవడం దారుణమన్నారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం రామకుప్పం, శాంతిపురం మం డలాల మధ్య ఎయిర్‌స్ట్రిప్‌ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేసిందన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఎయిర్‌స్ట్రిప్‌ పనులు ప్రాంభించి పూర్తి చేయాలన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో కుప్పంలో అభివృద్ధి స్తం భించిందన్నారు. సీఎంగా చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు రూ.1400కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అభివృద్ధిని అటకెక్కించి ఓట్ల కోసం అబద్ధాలు చెప్ప డం సీఎం జగన్‌కు తగదన్నారు.  విజయ్‌కుమార్‌రెడ్డి, జయశంకర్‌, సత్తి, రామలింగారెడ్డి, సలాంసాబ్‌ తదితరులు పాల్గొన్నారు.



భరోసాకు బదులు భయం...


శాంతిపురం: సీఎం జగన్‌ పర్యటన కుప్పం ప్రజల్లో భరోసాకు బదులు భయాన్ని నింపిందని ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, టీడీపీ నేతలు పెద్దన్న, నారాయణస్వామి, సింగిరిశ్రీనివాసులు అన్నారు. శుక్రవారం శాంతిపురంలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు కుప్పం ప్రజలపై ప్రేమ కన్నా, చంద్ర బాబుపై ద్వేషమే కన్పించిందన్నారు. అడుగడుగునా పోలీసులు మోహరించి, దుకాణాలు మూయించి, ప్రజలను దరి చేరనీయకుండా సభ నిర్వహించడం ఎంత వరకు సమంజసమన్నారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాలు, జిల్లాలనుంచి జనాన్ని తర లిం చారన్నారు. సమావేశానికి రాకపోతే డ్వాక్రా మహిళలకు రూ.500 జరిమానా వేస్తామని భయ పెట్టడం దారుణమన్నారు. సీఎం సభలో ప్రజలకన్నా, పోలీసులే ఉక్కువగా ఉన్నారన్నారు. కుప్పాన్ని చంద్రబాబు అభివృద్ధి చేయలేదని సీఎం జగన్‌ పేర్కొనడం హాసాస్పదమన్నారు. చంద్రబాబు ఎక్కడ నివాసమున్నా రాష్ట్రాన్ని, కుప్పాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. సీఎం జగన్‌ తాడేపల్లెలో ప్యాలెస్‌ కట్టుకుని రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమిటని వారు ప్రశ్నించారు. పులివెందులలో బస్టాండు కూడా నిర్మించలేని వ్యక్తి కుప్పంలో ఏదో చేశామని బీరాలు పలకడం విచిత్రంగా ఉందన్నారు. కుప్పంలో ఉన్నత విద్యాసంస్థలు, గ్రామాలకు తారురోడ్లు, గ్రామాల్లో సీసీరోడ్లు, తాగునీటిట్యాంకులు, స్టార్‌ హోటళ్లను తలపించేలా సంక్షేమ హాస్టళ్లను నిర్మించింది చంద్ర బాబు కాదా అని వారు ప్రశ్నించారు. హంద్రీ-నీవా పనులు, చంద్రబాబు కుప్పంలో ప్రతిపాదించిన  రూ.1400కోట్ల పనులకు నిధులను జగన్‌ ప్రభుత్వం ఆపి వేసిందని, ఎయిర్‌స్ట్రిప్‌ నిర్మాణాన్ని పట్టించుకోలే దన్నారు. కుప్పంలో టీడీపీ పాలనలో జరిగిన అభివృద్దిపై సీఎంతో సహా మంత్రి పెద్దిరెడ్డి సిద్ధమా అన్ని వారు ప్రశ్నించారు. ఓట్ల కోసం సీఎం జగన్‌ చేస్తున్న జిమ్మిక్కులను కుప్పం ప్రజలు పట్టించుకోరన్నారు. 2024ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు.

Updated Date - 2022-09-24T04:44:08+05:30 IST