ఎమ్మార్పీకే ఎరువులను విక్రయించాలి: జేడీఏ

ABN , First Publish Date - 2021-04-23T05:22:08+05:30 IST

ఎమ్మార్పీకే ఎరువులను విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జేడీఏ ఉమామహేశ్వరమ్మ హెచ్చరించారు.

ఎమ్మార్పీకే ఎరువులను విక్రయించాలి: జేడీఏ

కర్నూలు (అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 22: ఎమ్మార్పీకే ఎరువులను విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జేడీఏ ఉమామహేశ్వరమ్మ హెచ్చరించారు. గురువారం కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కవ ధరకు విక్రయిస్తే లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువులు ఎక్కువ ధరకు విక్రయిస్తే వ్యవసాయ అధికారులకు, అలాగే రైతు సమాచార కేంద్రానికి (టోల్‌ఫ్రీ నెంబర్‌ 155, 251) ఫిర్యాదు చేయాలని జేడీఏ సూచించారు. ప్రస్తుతం రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులు సాగు చేసే పంటలకు అవసరమైన ఎరువులను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్‌బీకే పరిధిలో పంటల సాగు ఎరువుల అవసరాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా ప్రతి కేంద్రంలో 5 టన్నులకు తగ్గకుండా నిల్వ చేయనున్నట్లు ఆమె తెలిపారు.


Updated Date - 2021-04-23T05:22:08+05:30 IST