నంద్యాలలో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

Sep 15 2021 @ 12:02PM

కర్నూలు జిల్లా: నంద్యాలలో గణేష్ నిమజ్జనంలో ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవికిషోర్ రెడ్డి వాహనాన్ని ఓ యువకుడు మద్యం మత్తులో అడ్డుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కారు దిగి అతనిని చితకబాదారు. శిల్ప రవి కారును అడ్డుకుని అద్దాలను చేతులతో కొట్టే ప్రయత్నం చేయడంతో దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన నంద్యాల ఫరూక్‌నగర్‌లో చోటు చేసుకుంది. యువకుడు అతిగా తాగి ఎమ్మెల్యే వాహనంపై దాడి చేయడానికి ప్రయత్నించాడని.. అందుకే అడ్డుకున్నామని ఎమ్మెల్యే అనుచరులు తెలిపారు. దాడిలో గాయపడిన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.