నేడు, రేపు కర్నూలులో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-11-26T16:18:30+05:30 IST

నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నేడు, రేపు కర్నూలులో భారీ వర్షాలు

కర్నూలు: నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ వీరపాండియన్ సూచించారు. మరోవైపు జిల్లాకు నివర్ తుఫాన్  ముప్పుతో పుష్కర విధుల్లో ఉన్న 5 వేల మంది పోలీసులను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అప్రమత్తం చేశారు. సహాయక చర్యలకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. పుష్కరాలకు  వచ్చే భక్తులను సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని ఎస్పీ ఫక్కిరప్ప ఆదేశించారు. 

Updated Date - 2020-11-26T16:18:30+05:30 IST