Kurnool: వీఆర్‌కు తుగ్గలి ఎస్సై సమీర్ బాష

ABN , First Publish Date - 2022-07-08T15:38:22+05:30 IST

తుగ్గలి ఎస్సై సమీర్ బాషను వీఆర్‌కు పంపిస్తూ ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Kurnool: వీఆర్‌కు తుగ్గలి ఎస్సై సమీర్ బాష

కర్నూలు: తుగ్గలి ఎస్సై (SI) సమీర్ బాషను వీఆర్‌కు పంపిస్తూ ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ (Siddarth kowshal) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ జంటకు వివాహం చేసే విషయంలో మధ్యవర్తి రాజు ద్వారా ఎస్సై సమీర్ రూ.40 వేలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను లంచం డిమాండ్ చేయలేదని.. ఏబీఎన్‌లో ఎస్సై సమీర్ బాషపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అమ్మాయి కుటుంబ సభ్యులతో ఎస్సై చెప్పించాడు. అమ్మాయి కుటుంబ సభ్యులతో చెప్పించిన వీడియోలను జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి పోలీసు అధికారులను నమ్మించి, ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎస్పీ... పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2022-07-08T15:38:22+05:30 IST