కుట్రాలంలో వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-07-15T15:32:31+05:30 IST

కుట్రాలం జలపాతాల్లో అడవి వెల్లువల కారణంగా నీటి ఉధృతి అధికం కావటంతో స్నానాలపై అధికారులు నిషేధం విధించారు. తెన్‌కాశి జిల్లా కుట్రాలం

కుట్రాలంలో వరద ఉధృతి

                                - స్నానాలపై నిషేధం


చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కుట్రాలం జలపాతాల్లో అడవి వెల్లువల కారణంగా నీటి ఉధృతి అధికం కావటంతో స్నానాలపై అధికారులు నిషేధం విధించారు. తెన్‌కాశి జిల్లా కుట్రాలం జలపాతాల్లో జూన్‌ నుంచి ఆగస్టు వరకూ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఐదు జలపాతాల వద్ద స్నానాలు చేస్తుంటారు. ప్రధాన జలపాతం, పులియరువి, ఐందరువి, సిట్రరువి, పాత కుట్రాలం ఇలా ఐదు జలపాతాల్లో ప్రవహించే ఔషధగుణాలు కలిగిన నీటిలో స్నానం చేయడానికి పర్యాటకులు పోటీపడుతుంటారు. తెన్‌కాశి జిల్లాలో నెలరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. దీనితో పర్యాటకులు ఆసక్తిగా స్నానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐదు జలపాతాలున్న అటవీ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో అడవి వెల్లువ కారణంగా నీటి ఉదృతి పెరగడంతో ఆ జలపాతాల వద్ద పర్యాటకులు స్నానం చేయరాదని అధికారులు ఆంక్షలు విధించారు.

Updated Date - 2022-07-15T15:32:31+05:30 IST