శిక్షణ కేంద్రానికి కుట్టుమిషన్‌ అందజేత

Published: Wed, 17 Aug 2022 22:02:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 శిక్షణ కేంద్రానికి కుట్టుమిషన్‌ అందజేత కుట్టుమిషన్‌ను అందచేస్తున్న గడ్డం మల్లి కార్జునరెడ్డి తదితరులు

కావలి, ఆగస్టు 17: స్థానిక వెంగళరావునగర్‌లో సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రానికి ఆ సంస్థ సభ్యుడు గడ్డం మల్లికార్జునరెడ్డి బుధవారం కుట్టుమిషన్‌ అందజేశారు.  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌ మాట్లాడుతూ గడ్డం మల్లికార్జునరెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం శిక్షణ కేంద్రానికి కుట్టుమిషన్‌ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బుర్లా రఘుకుమార్‌రెడ్డి, విశ్రాంత లెక్చరర్‌ ఎంవీఎన్‌ ప్రసాద్‌రావు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, కుట్టు శిక్షకురాలు ఆయేషా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.