కుటుంబసమస్యలతో

ABN , First Publish Date - 2020-12-02T06:39:18+05:30 IST

కుటుంబంలో వివాదంతో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగపాడు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోకల ఆనందరావు(33) హాలి యా మండలం పులిచర్లలో పనిచేస్తున్నాడు. ఆనందరావుకు మండ లంలోని మదార్‌గూడెం గ్రామానికి చెందిన యువతితో ఆరునెలల క్రితం వివాహం జరిగింది.

కుటుంబసమస్యలతో
ఆనందరావు (ఫైల్‌ ఫొటో)

ఉపాధ్యాయుడి బలవన్మరణం

మిర్యాలగూడ రూరల్‌, డిసెంబరు 1: కుటుంబంలో వివాదంతో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగపాడు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోకల ఆనందరావు(33)  హాలి యా మండలం పులిచర్లలో పనిచేస్తున్నాడు.  ఆనందరావుకు మండ లంలోని మదార్‌గూడెం గ్రామానికి చెందిన యువతితో ఆరునెలల క్రితం వివాహం జరిగింది.  ఆనందరావు తన తల్లిదండ్రులు, భార్య తో ఒకే ఇంటిలో ఉంటున్నారు.  కుటుంబం  వివాదాల నేపథ్యంలో భార్య  నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో మన స్తాపం చెందిన ఆనందరావు  ఇంట్లో సీలింగ్‌ ఇనుప కొండీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  సమాచారం అందుకున్న  రూరల్‌ పోలీసులు ఆనందరావు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆనందరావు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

రూ.10 వేల  విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

 ఇద్దరిపై కేసు నమోదు

నిందితుల్లో నల్లగొండ వ్యాపారి

ఆటో సీజ్‌

తిప్పర్తి, డిసెంబరు 1: గుట్కాలు తరలిస్తున్న ఆటోను పోలీసులు సీజ్‌ చేసి రూ.10 వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.  గుట్కాలను ఆటోలో తరలిస్తున్న వ్యక్తిపై, గుట్కాలను విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కొండ శ్రీనివాస్‌ టీఎస్‌ 05యుబీ0158  నెంబరుగల గూడ్స్‌ ఆటోలో రూ.10 వేల విలువైన 19 గుట్కా ప్యాకెట్లను నల్లగొండ నుంచి మిర్యాలగూడెంకు  తరలిస్తుండగా మార్గమధ్యలో తిప్పర్తి శివారులో పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ పట్టణానికి చెందిన వ్యాపారి మీలా వెంకటేశ్వర్లు వద్ద గూట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి తిప్పర్తి మండల పరిసర ప్రాంతాల కిరాణం దుకాణాల్లో  హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నట్లు శ్రీనివాస్‌ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు  శ్రీనివాస్‌తోపాటు వ్యాపారి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ జి.సత్యనారాయణ తెలిపారు. 


బసిరెడ్డిపల్లిలో పులి కలకలం

 హైనాగా తేల్చిన  అటవీశాఖ అధికారులు

పెద్దవూర, డిసెంబరు 1: మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామ శివారులో పులి సంచరి స్తోందని మంగళవారం కలకలం రేగింది.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులకు వెళ్లి వస్తున్న ఓరైతు గ్రామ శివారులోని గంగమ్మదేవి గుడి సమీ పంలో ఉన్న  వంతెనపైకి ్యవసాయ భూముల నుంచి పులి రావడాన్ని గమనించాడు. భయాందోళన చెందిన రైతు వేరే మార్గం నుంచి  గ్రామానికి చేరుకుని గ్రామస్థులకు తెలిపాడు. ఈ విషయం ఎస్‌ఐ సైదాబాబుకు సమాచారం అందడంతో బసిరెడ్డిపల్లికి వచ్చి గ్రామస్థులను అప్రమత్తం చేశారు.  ప్రజలు ఇంటి తలుపులు వేసుకోవాలని,  గ్రామ శివార్లకు సమూహంగా వెళ్లాలని ఎస్‌ఐ సూచించారు. ఈ సందర్భంగా  అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పులుల సంచారం లేదని, పులిని పోలిన హైనాలు తిరుగుతాయన్నారు.  గతంలో  మండల పరిధిలోని కొత్తలూరు గ్రామంలో హైనా తిరిగితే పులి అని ప్రజలు భయపడినట్లు తెలిపారు.  గ్రామంలో అటవీశాఖ అధికారులతో కలిసి పోలీసులు గస్తీ తిరుగుతారని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-02T06:39:18+05:30 IST