Kuwait Airport: కువైత్ విమానాశ్రయానికి భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి.. కారణమిదే

ABN , First Publish Date - 2022-08-21T17:21:29+05:30 IST

వేసవి సెలవులు (Summer Holidays) ముగియడంతో పాటు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విహారయాత్రలకు, స్వదేశానికి వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైత్ చేరుకుంటున్నారు.

Kuwait Airport: కువైత్ విమానాశ్రయానికి భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి.. కారణమిదే

కువైత్ సిటీ: వేసవి సెలవులు (Summer Holidays) ముగియడంతో పాటు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విహారయాత్రలకు, స్వదేశానికి వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైత్ చేరుకుంటున్నారు. దీంతో గడిచిన రెండు రోజులుగా కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Kuwait International Airport) ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ఈ రెండు రోజుల్లో బయటి దేశాల నుంచి కువైత్ ఎయిర్‌పోర్టుకు ఏకంగా 340కి పైగా విమానాలు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇందులో ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, దుబాయ్ నుంచి అధిక సంఖ్యలో విమానాలు విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపారు. ఇలా రోజుకు కనీసం 25వేల నుంచి 30వేల వరకు ప్రయాణికులు ఇతర దేశాల నుంచి కువైత్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారని అధికారులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.  

Updated Date - 2022-08-21T17:21:29+05:30 IST