ltrScrptTheme3

Tourist visa పై కువైత్ కీలక నిర్ణయం.. జీసీసీ, 53 దేశాల వారికి మాత్రమే ఆ అవకాశం..

Nov 25 2021 @ 10:24AM

కువైత్ సిటీ: టూరిస్ట్ వీసా జారీ విషయమై కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలలోని విదేశీ నివాసులతో పాటు మరో 53 దేశాల వారికి మాత్రమే టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు భారత పౌరులకు మాత్రం అవకాశం లేదు. ఇక టూరిస్ట్ ఈ-వీసా, ఆన్‌లైన్ చెల్లింపుల కోసం మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను జత చేసినట్లు  అధికారులు వెల్లడించారు. జీసీసీ దేశాల్లో(సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, కువైత్) ఆరు నెలల కంటే ఎక్కువ నివాసం ఉన్న ప్రవాసులతో పాటు 2008లో తీసుకువచ్చిన మంత్రివర్గ తీర్మానం నం. 220  ప్రకారం ప్రత్యేక వృత్తులు కలిగిన వారు టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  


మంత్రివర్గ తీర్మానం ప్రకారం జీసీసీ దేశాల్లోని ఈ క్రింది వృత్తులవారు టూరిస్ట్ ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. అవెంటంటే.. కన్సల్టెంట్స్, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, జడ్జిలు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులు, యూనివర్శిటీ అధ్యాపకులు, ప్రెస్ అండ్ మీడియా సిబ్బంది, పైలట్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, సీస్టం అనలిస్ట్స్, మేనేజర్స్, వ్యాపారవేత్తలు, దౌత్య దళం, యూనివర్శిటీ గ్రాడ్యుయేట్స్, సౌదీ ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు. 

ఇక పర్యాటక ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్న 53 దేశాల జాబితా ఇదే..

Andorra

Australia

Austria

Belgium

Bhutan

Brunei

Bulgaria

Cambodia

Canada

Croatia

Cyprus

Czech

Denmark

Estonia

Finland

France

Georgia

Germany

Greece

Hungary

Iceland

Ireland

Italy

Japan

Laos

Latvia

Liechtenstein

Lithuania

Luxembourg

Malaysia

Malta

Monaco

Netherlands

New Zealand

Norway

Poland

Portugal

Romania

San Marino

Serbia

Singapore

Slovakia

Slovenia

South Korea

Spain

Sweden

Switzerland

The People’s Republic of China – Hong Kong

Turkey

Ukraine

United Kingdom

United States

Vatican

మార్గదర్శకాలు/నియమాలు..

* దేశంలోకి ప్రవేశించిన వెంటనే ఎంట్రీ పాయింట్ వద్ద వీసా ఫీజుగా 3 కువైటీ దినార్లు(రూ.737) చెల్లించాలి.

* ఈ-వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు పాస్‌పోర్ట్ చెల్లుబాటు ఆరు నెలల కంటే ఎక్కువ ఉండాలి.

* ఒక టూరిస్ట్ వీసా కువైత్‌లోకి ఒక్క ఎంట్రీ కోసం మాత్రమే జారీ చేయబడుతుంది. అది కూడా ఒక నెల గడవుతో మాత్రమే. 

* టూరిస్ట్ వీసా కలిగిన వారు ఎంట్రీ తేదీ నుంచి తాత్కాలికంగా మూడు నెలల వరకు కువైత్‌లో నివాసం ఉండొచ్చు. అలాగే గడువు ముగియడానికి ముందే వీసాదారు దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

* టూరిస్ట్ వీసా హోల్డర్ దేశంలో పని చేయడానికి అనుమతి ఉండదు. ఒకవేళ వీసాదారు ఈ నియమాన్ని ఉల్లంఘించి పట్టుబడితే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.

* అనుమతించబడిన వ్యవధిని దాటిన సందర్శకుడికి జరిమానా విధిస్తారు. అలాగే చట్టపరమైన జవాబుదారీతనానికి లోబడి భవిష్యత్తులో వీసా జారీ చేయకుండా అతడు/ఆమెను అనర్హులుగా ప్రకటిస్తారు.

* సమర్పించిన దరఖాస్తులను అధికారిక పని దినాలలో పని గంటలలోపు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇందులో కువైత్ వారాంతాలు (శుక్ర, శనివారం), ప్రభుత్వ సెలవులు ఉండవు.

* పర్యాటక ఈ-వీసా దరఖాస్తు స్టేటస్‌(ఆమోదించబడిన లేదా తిరస్కరించబడిన)ను ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.