అందులో cheapest country కువైత్..

ABN , First Publish Date - 2022-07-13T14:07:22+05:30 IST

నంబియో (Numbeo) వెబ్‌సైట్ తాజాగా ప్రపంచంలో జీవించడానికి అత్యంత చౌకైన దేశాల జాబితాను విడుదల చేసింది.

అందులో cheapest country కువైత్..

కువైత్ సిటీ: నంబియో (Numbeo) వెబ్‌సైట్ తాజాగా ప్రపంచంలో జీవించడానికి అత్యంత చౌకైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాల్లో అత్యంత చౌకైన దేశంగా కువైత్ నిలిచింది. అలాగే అరబ్ దేశాల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోని జీవన వ్యయం (Cost of living) ఇండెక్స్ ఆధారంగా ఈ నివేదికను నంబియో (Numbeo) వెబ్‌సైట్ రూపొందించింది. ఇక ఈ వెబ్‌సైట్ ద్వైవార్షిక జీవన వ్యయ సూచికను ప్రచురిస్తుంటుంది. ఇది ప్రపంచంలోని 137 దేశాలలో వినియోగ వస్తువుల ధరలను కొలిచే సాపేక్ష సూచిక. ఇందులో కిరాణా, రెస్టారెంట్లు, రవాణా, యుటిలిటీల ఖర్చులు ఉంటాయి. అయితే, ఇది అద్దె లేదా తనఖా వంటి వసతి ఖర్చులను మాత్రం కలిగి ఉండదు.  


కాగా, అరబ్ దేశాలలో జీవించడానికి అత్యంత ఖరీదైన దేశంగా లెబనాన్ నిలిచింది. అటు ప్రపంచవ్యాప్తంగా లెబనాన్ 18వ స్థానంలో ఉంది. అలాగే ఖతార్ రెండో స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 30వ స్థానం పొందింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యూఏఈ(UAE)-35, బహ్రెయిన్-40, సౌదీ అరేబియా-44, పాలస్తీనా-45, ఒమన్-50, జోర్డాన్-52 ర్యాంకులు సాధించగా కువైత్ 56వ స్థానంలో నిలిచింది. అటు లిబియా, అల్జీరియా, ట్యునీషియా, సిరియా, ఈజిప్ట్ కూడా నివసించడానికి చౌకైన అరబ్ దేశాలుగా ర్యాంక్ సాధించాయి.


మరోవైపు అద్దె పెంపులో ఖతార్, యూఏఈ తర్వాత గల్ఫ్, అరబ్ దేశాలలో కువైత్ మూడో స్థానంలో ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, ఇటలీ, చైనా వంటి అనేక యూరోపియన్ దేశాల కంటే కువైత్ ఉన్నత స్థానంలో నిలవడం గమనార్హం. ఇక కొనుగోలు శక్తి సూచిక పరంగా అరబ్ దేశాలలో యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా తర్వాత కువైత్ నాల్గో స్థానంలో నిలిచింది. ఈ సూచిక ఆ నగరంలో సగటు నికర జీతం కోసం ఒక నిర్దిష్ట నగరంలో వస్తువులు, సేవలను కొనుగోలు చేయడంలో వ్యక్తి సాపేక్ష కొనుగోలు శక్తిని తెలిజేస్తుంది.

Updated Date - 2022-07-13T14:07:22+05:30 IST