క్వారంటైన్ విషయంలో కువైట్ కీలక నిర్ణయం !

ABN , First Publish Date - 2021-03-07T17:20:39+05:30 IST

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కువైట్ బయటి దేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల(7 రోజులు ఇన్స్టిట్యూషనల్, 7 రోజులు హోం) క్వారంటైన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

క్వారంటైన్ విషయంలో కువైట్ కీలక నిర్ణయం !

కువైట్ సిటీ: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కువైట్ బయటి దేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల(7 రోజులు ఇన్స్టిట్యూషనల్, 7 రోజులు హోం) క్వారంటైన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ విషయమై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. వేరే దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైతే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉంటారో వారికి ఈ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ బోథైనా అల్ ముదాఫ్ శనివారం వెల్లడించారు.


ఇటీవల నమోదవుతున్న ప్రపంచ దేశాల కరోనా ప్రభావ నివేదికలను పరిశీలించిన తర్వాత కువైట్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక కువైట్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 65 ఏళ్లకు పైబడిన పౌరులు, ప్రవాసులు ఎవరైతే వ్యాక్సిన్ కోసం తమ పేరు నమోదు చేసుకున్నారో వారందరికీ టీకా ఇవ్వడం పూర్తైనట్లు మంత్రి స్పష్టం చేశారు. కాగా, ఇప్పటి వరకు దేశ జనాభాలో కేవలం 17.4 శాతం మంది మాత్రమే టీకా కోసం రిజిస్టర్ చేసుకున్నారట. దేశంలోని పౌరులు, నివాసితులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి కనుక తొందరగా టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. 

Updated Date - 2021-03-07T17:20:39+05:30 IST