Kuwait లో Netflix ను బ్యాన్‌ చేయాలంటూ కేసు.. కోర్టు తీసుకున్న తాజా నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2022-05-27T15:34:22+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix పై దుమారం చెలరేగుతోంది.

Kuwait లో Netflix ను బ్యాన్‌ చేయాలంటూ కేసు.. కోర్టు తీసుకున్న తాజా నిర్ణయమిదీ..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix పై దుమారం చెలరేగుతోంది. దీనికి కారణం Perfect Strangers అనే మూవీ అరబ్ వెర్షన్ ఈ ఓటీటీలో ప్రసారం కావడమే. మూవీలోని కంటెంట్ ఆ దేశ ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందనే కారణంతో ఇప్పుడీ వ్యవహారం కోర్టుకు చేరింది. దేశవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌పై బ్యాన్ విధించాలంటూ అటార్నీ అబ్దుల్ అజీజ్ అల్ సుబై కోర్టులో కేసు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల 'పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్' చిత్రం అరబిక్ వెర్షన్‌ Netflix లో ప్రసారమైంది. అయితే, మూవీ కంటెంట్‌ కువైత్ సొసైటీ దాని ఆచారాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందంటూ Netflix ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ అటార్నీ అబ్దుల్ అజీజ్ కోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో సినిమా వివాదాస్పద కంటెంట్‌పై దేశంలో ఒక్కసారిగా విమర్శలు చెలరేగాయి. తాజాగా ఈ కేసును పరిశీలించిన కువైత్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు తదుపరి విచారణను జూన్ 8కి కేసును వాయిదా వేసింది. మరోవైపు కేసును తిరస్కరించాలని ప్రభుత్వ డిఫెన్స్ కోరడం గమనార్హం.

Updated Date - 2022-05-27T15:34:22+05:30 IST