Kuwait లో 47 రోజుల్లో 2,739 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

ABN , First Publish Date - 2021-10-20T14:07:41+05:30 IST

ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులపై కువైత్ ఉక్కుపాదం మోపుతోంది.

Kuwait లో 47 రోజుల్లో 2,739 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

కువైత్ సిటీ: ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులపై కువైత్ ఉక్కుపాదం మోపుతోంది. రెసిడెన్సీ గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న ప్రవాసులతో పాటు ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వారి పట్ల ఆ దేశ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలా ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే వలసదారులను వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తోంది. అంతర్గత మంత్రిశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 47 రోజుల్లో  భారీగా ప్రవాసుల దేశ బహిష్కరణ జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 17 వరకు ఏకంగా 2,739 మందిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ దేశ అంతర్గత మంత్రి షేక్ థామర్ అల్ అలీ సూచన మేరకు 47 రోజుల్లో 2,739 ప్రవాసులను సంబంధిత అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. మంత్రి ఆదేశాలను మినిస్ట్రీ అండర్‌సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ అమలు చేశారు.   

Updated Date - 2021-10-20T14:07:41+05:30 IST