Entry Visa: కువైత్ కీలక ప్రకటన.. ఈ వీసాలు వారికి మాత్రమేనట!

Published: Thu, 24 Mar 2022 11:57:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Entry Visa: కువైత్ కీలక ప్రకటన.. ఈ వీసాలు వారికి మాత్రమేనట!

కువైత్ సిటీ: కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ ఈ నెల 20వ తేదీ(ఆదివారం) నుంచి ఎంట్రీ వీసాల జారీని ప్రారంభించిన విషయం తెలిసిందే. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ మూడు నెలల కాలపరిమితితో ఈ వీసాలను జారీ చేస్తోంది. అయితే, ఈ వీసా అన్ని కేటగిరీల వారికి ఇవ్వడం లేదని తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేవలం బిజినెస్ వీసా కేటగిరీకి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ తౌహీద్ అల్ కందారీ మాట్లాడుతూ, తాము కేవలం బిజినెస్ వీసాలకు సంబంధించి మాత్రమే ప్రకటన చేసినట్లు తెలిపారు. మహమ్మారి నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం బిజినెస్ వీసాల వాలిడిటీని  మంత్రిత్వశాఖ ఆరు నెలలకు పొడిగించింది. సాధారణంగా ఈ వీసాల గడువు కేవలం మూడు నెలలు మాత్రమే. ప్రస్తుతం కోవిడ్-19 ప్రభావం తగ్గుముఖం పట్టడంతో తిరిగి బిజినెస్ వీసాల వాలిడిటీని 3 నెలలకు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఫ్యామిలీ వీసాలకు సంబంధించి, ఇది ప్రస్తుతం నిర్దిష్ట షరతుల ఆధారంగా కొంతమంది దరఖాస్తుదారులకు మాత్రమే పరిమితం చేయబడిందని తౌహీద్ అల్ కందారీ తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.