కువైట్‌లో అంగరంగ వైభవంగా మహానాడు వేడుకలు!

ABN , First Publish Date - 2022-06-05T03:23:35+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు నేతృత్వంలో కువైట్‌లో తెలుగుదేశం పార్టీ.. మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించింది.

కువైట్‌లో అంగరంగ వైభవంగా మహానాడు వేడుకలు!

ప్రవాసీల సంక్షేమాన్ని గాలికొదిలేసిన వైసిపి ప్రభుత్వం!

వైసీపీ ముష్కరులకు వడ్డీతో సహా చెల్లిస్తాం: పట్టాభి హెచ్చరిక

కువైట్ ప్రవాసీ తెలుగుపౌరుల సంక్షేమానికి కృషిచేస్తాం: పంతగాని


కువైట్: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు,  జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు నేతృత్వంలో  కువైట్‌లో తెలుగుదేశం పార్టీ.. మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు  నరసింహ ప్రసాద్ హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం ఖైతాన్  ప్రాంతంలో ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన కువైట్ మహానాడుకి వివిధ ప్రాంతాలనుండి భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించి, భారీ కేక్‌ను కట్ చేశారు. కాగా..  కువైట్‌లో నివసిస్తున్న సుమారు 4లక్షలమంది ప్రవాస తెలుగుపౌరుల సంక్షేమాన్ని గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.   


ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు పార్టీ కేడర్‌ను ఇబ్బందులు పెడుతున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పని ప్రారంభిస్తామని, చంద్రబాబునాయుడు  ప్రమాణ స్వీకారం వరకు కూడా ఆగబోమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 4 లక్షలమంది వివిధ వృత్తుల వారు కువైట్ దేశంలో డ్రైవర్లు, హౌస్ మెయిడ్స్, హౌస్ కీపర్స్ తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  రాయలసీమ నుంచి వెళ్లిన వారు అత్యధిక సంఖ్యలో కువైట్‌కు వెళ్లి బతుకుబండి లాగిస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని ఏర్పాటుచేసి ప్రవాస తెలుగుపౌరులకు ఏ కష్టమొచ్చినా ఆదుకునేవారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత మూడేళ్లలో కువైట్‌లోని ప్రవాస తెలుగుపౌరుల సంక్షేమాన్ని, సమస్యలను గాలికొదిలేసిందని పట్టాభి ఆవేదన వ్యక్తంచేశారు.

 

తెలుగుదేశం పార్టీ సాంస్కృతి విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ మాట్లాడుతూ అధికారంలో లేకపోయినప్పటికీ తెలుగుదేశం కువైట్ విభాగం ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసులకు ఇతోధికంగా సాయం చేస్తూ భరోసా కల్పిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందని, కువైట్‌లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కృషిచేస్తుందని తెలిపారు. కువైట్ తెలుగుదేశం ముఖ్యనేత ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి మోసపురిత పథకాలు,  వైఫల్యాలను ఎండగట్టారు. త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు.


ఈ సందర్భంగా పార్టీ సభ్యులు పలు తీర్మానాలను ఆమోదించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ బలోపేతానికి తమవంతు సహకారం అందించాలని తీర్మానించారు.  పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కువైట్‌లో పెద్దఎత్తున చేపట్టాలని నిర్ణయించారు.  వైసీపీ ముష్కరుల చేతిలో హతమైన కంచర్ల జల్లయ్యకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కువైట్ సీనియర్ నాయకులు షేక్ బాషా, బోయపాటి శ్రీనివాసులు, దుగ్గి శ్రీనివాసులు, విసి సుబ్బారెడ్డి, దుర్గాప్రసాద్, షేక్ చాన్ బాషా, పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-05T03:23:35+05:30 IST