టీచర్ల విషయంలో Kuwait కీలక ప్రకటన..!

ABN , First Publish Date - 2021-12-17T18:14:56+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.

టీచర్ల విషయంలో Kuwait కీలక ప్రకటన..!

కువైత్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా దేశాలు వైరస్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా గల్ఫ్ దేశం కువైత్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను పరిగణలోకి తీసుకుని ముందు జాగ్రత్తగా కువైత్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యయులు, ఇతర సిబ్బందికి బూస్టర్ డోస్ ఇవ్వాలని ఆ దేశ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు బూస్టర్ డోసు వేసుకునేలా చొరవ తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాలు, మేనేజ్‌మెంట్లకు ఆ దేశాలు జారీ చేసింది. దీనికోసం ఇప్పటికే ప్రతిచోట టీకాలు అందుబాటులో ఉంచినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరోగ్యశాఖ అధికారుల సూచన మేరకు పలు జాగ్రత్తలతో టీకా వేసుకోవాలని తెలిపింది. అలాగే స్కూళ్లలో కరోనా నిబంధనలను పకడ్బిందిగా అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాలను మంత్రిత్వశాఖ ఆదేశించింది. పిల్లలు, సిబ్బంది కరోనా బారిన పడడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.   


Updated Date - 2021-12-17T18:14:56+05:30 IST