కువైత్‌లో పోటాపోటీగా మహానాడు.. తెలుగు దేశం అభిమానుల సందడి

ABN , First Publish Date - 2022-05-28T13:57:18+05:30 IST

కువైత్‌లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ అభిమానులు స్ధానికంగా మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

కువైత్‌లో పోటాపోటీగా మహానాడు.. తెలుగు దేశం అభిమానుల సందడి

కువైత్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ అభిమానులు స్ధానికంగా మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటాపోటిగా రెండు శిభిరాలు నిర్వహించిన మహానాడు విజయవంతమైంది. కోడూరి వెంకట్ నేతృత్వంలోని కువైత్ ఎన్నారై టీడీపీ సెల్ నిర్వహించిన మహానాడులో రాయలసీమ అభివృద్ధి కొరకు కడపలో చంద్రబాబు నాయుడు శంఖుస్ధాపన చేసిన ఉక్కు కార్మాగారం పనులలో ఏలాంటి పురోగతి లేదని  వక్తలు ఆక్షేపించారు. సంవత్సరం పొడువునా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని దీనికోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె. అచ్చంనాయుడు, శాసన సభ్యులు బాలకృష్ణాను కువైత్‌కు ఆహ్వనించాలని మహానాడు తీర్మానించినట్లు వెంకట్ తెలిపారు. మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ బొర్రా ఎన్నారై టీడీపీ కువైత్ మైనారిటీ విభాగం కమిటీ సభ్యులు, ఎన్నారై టీడీపీ గల్ఫ్ కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ సేవా సమితి కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ పరిటాల ట్రస్ట్ మరియు చంద్రన్న సేవా సమితి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నారా, నందమూరి అభిమానులు అందరూ కలిసి పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. దీనిలో భాగంగానే జూన్ 10న ఒక కార్యక్రమం నిర్వహించయడానికి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చం నాయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను కూడా ఆహ్వానించడం జరిగిందని నిర్వహకులు తెలిపారు. 


ఈ సందర్భంగా గౌరవ అతిథి వెంకట్ కోడూరి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, చంద్రబాబు తెలుగు జాతి అభివృద్ధి కోసం కష్టపడి చేసిన పనిని ప్రస్తుతం జగన్ నాశనం చేశారని వెంకట్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం మైనార్టీ హక్కుల, సంక్షేమ కార్యక్రమాలు విషయంలో అన్యాయం చేస్తుందని మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ముస్తాక్ ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారని టీడీపీ గల్ఫ్ సెల్ ప్రతినిధి శంకర్ పేర్కొన్నారు. కడపలో పరిశ్రమల స్ధాపన కొరకు చంద్రబాబు నాయుడు చేసిన కృషిని గుర్తుంచుకోవాలని ఓలేటి రెడ్డయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డయ్య, విజయ్ కుమార్, ఖదీర్ బాషా, గౌహర్ అలీ, నారాయణమ్మ, అంజలి, అంజనా రెడ్డి, నిర్మలమ్మ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ సెల్ కువైత్ ఓలేటి రెడ్డి చౌదరి, షేక్ యం.డి అర్షద్ సమన్వయం చేశారు.




Updated Date - 2022-05-28T13:57:18+05:30 IST