Kuwait ను వేధిస్తున్న కార్మికుల కొరత.. డబుల్ శాలరీ ఆఫర్ చేస్తున్నా ఆ రంగంలోకి..

Sep 22 2021 @ 15:48PM

కువైత్ సిటీ: కువైత్‌లోని హోటల్ అండ్ రెస్టారెంట్ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది. దీనికి కారణం గడిచిన ఏడాది కాలంలోనే కరోనా కారణంగా సుమారు 8వేలకు పైగా మంది కార్మికులు కువైత్ వదిలి వెళ్లిపోవడం. అలాగే విదేశీ కార్మికుల నియామకాలపై ఉన్న నిషేధం కూడా. దాంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఈ రంగంలో నిష్ణాతులైన కార్మికుల కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. ఏకంగా ఇప్పుడు ఇస్తున్న శాలరీలకు రెట్టింపు ఇస్తామని చెబుతున్న కార్మికులు దొరకని వైనం. పోనీ కొత్త కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటికిప్పుడు తయారు చేద్దామన్న కుదరదు. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం అక్కడి రెస్టారెంట్ ఇండస్ట్రీ ఉంది. 


ఇవి కూడా చదవండి..

Kuwait లో ఎడమ చేతితో తినకూడదా..? 

ఆ వీసాదారులకు Kuwait గుడ్‌న్యూస్.. ప్రవాసులకు లక్కీ ఛాన్స్!


కువైత్‌లోని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు రెస్టారెంట్ రంగానికి చెందిన 8,641 మంది కార్మికులు కువైత్ వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక కరోనా కారణంగా విదేశీ కార్మికులను నియమించుకోవడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఇలా బ్యాన్ విధించి ప్రస్తుతం ఏడాది కావొస్తోంది. దీంతో ఈ రంగంలో కార్మికుల కోరత ఏర్పడింది. ఇప్పుడది తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ సెక్టార్‌లో ప్రావీణ్యం ఉన్న కార్మికుల కోసం యాజమాన్యాలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఇప్పుడు ఇస్తున్న జీతాలకు రెట్టింపు ఇస్తామని చెప్పిన కార్మికులు దొరకడం లేదని రెస్టారెంట్స్, హోటళ్ల యాజమాన్యాలు వాపోతున్నాయి.


కార్మికుల కోరత కారణంగా ప్రస్తుతం ఫుడ్ ఇండస్ట్రీలో సాలరీలు రెట్టింపు కంటే అధికమైనట్లు రెస్టారెంట్ ఫెడరేషన్ చీఫ్ ఫహాద్ అల్ అర్బాష్ వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కార్మికులు ఈ రంగంలో నిష్ణాతులు కారని, ఇప్పటికిఇప్పుడు వారికి శిక్షణనిచ్చి తయారు చేయడం కూడా కుదరని పనిగా ఆయన చెప్పారు. విదేశీ కార్మికుల నియమకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడమే ఈ సమస్యకు పరిష్కారంగా ఫహాద్ చెప్పుకొచ్చారు.       

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.