Kuwait: ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని పూర్తిగా నిలిపివేసిన కువైత్.. కారణం ఇదేనట

ABN , First Publish Date - 2022-07-24T14:52:10+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఇటీవల ఫ్యామిలీ విజిట్ వీసాల (Family Visit Visas) జారీని పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Kuwait: ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని పూర్తిగా నిలిపివేసిన కువైత్.. కారణం ఇదేనట

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఇటీవల ఫ్యామిలీ విజిట్ వీసాల (Family Visit Visas) జారీని పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా ఎందుకు చేసిందనే విషయమై తాజాగా ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ, రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ వివరణ ఇచ్చాయి. ఇందులో ముఖ్యంగా ప్రవాసులు భారీగా ఉల్లంఘనలకు పాల్పడడమేనని పేర్కొన్నాయి. ఫ్యామిలీ విజిట్ వీసాలపై దేశానికి వచ్చిన చాలా మంది ప్రవాసులు తిరిగి వారి దేశాలకు వెళ్లలేదట. వీసా గడువు ముగిసిన చాలామంది అలాగే దేశంలోనే ఉండిపోయారని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇలా సుమురు 20వేల మంది ప్రవాసులు ఫ్యామిలీ విజిట్ వీసాలపై వచ్చి కువైత్‌లోనే ఉండిపోయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ కేటగిరీ వీసాల జారీని పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించింది. తిరిగి ఫ్యామిలీ విజిట్ వీసాల జారీ ఎప్పుడు ప్రారంభమతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ వీసాల జారీ తిరిగి ప్రారంభించడమనేది ఉప ప్రధాని, అంతర్గత శాఖమంత్రి చేతుల్లోనే ఉందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. 


అయితే, కువైత్ వెళ్లే ప్రవాసులకు చిన్న ఉపశమనం ఎంటంటే.. కమర్షియల్ విజిట్ వీసాల జారీ ఆగకపోవడం. ఈ వీసాల జారీ మాత్రం కొనసాగుతోంది. ఇక గృహా కార్మికులకు ఇచ్చే కొత్త వీసాలపై కూడా రెసిడెన్స్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ తాజాగా ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఎవరైతే తమ ఒర్జినల్ వీసా పొగొట్టుకున్నారో వారు పీఎఫ్7(PF7) ఫీచర్ ద్వారా పాత వీసాను కోల్పోకుండా దాని గడువు ముగిసేవరకు ఉపయోగించుకోవచ్చని తన సర్క్యులర్‌లో పేర్కొంది.

Updated Date - 2022-07-24T14:52:10+05:30 IST