కువైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-04-21T23:24:11+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 71వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కువైట్ విభాగం...

కువైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు

కువైట్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 71వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కువైట్ విభాగం జూమ్ కాల్ ద్వారా నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రముఖ నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సేక్రటరీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, కదిరి తెలుగుదేశం నాయకులు బండారు మనోహర్ నాయుడు, మచిలీపట్నం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత, కవి అయినాల మల్లేశ్వర రావు, గాయకుడు ప్రవీణ్ కుమార్ అలాగే ఇండియా, అమెరికా, లండన్, సౌదీ అరేబియా, ఖతార్, బహరైన్, దుబాయ్, ఓమన్, బ్యాంకాక్ దేశాలలోని పార్టీ నాయకులు, చంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు. 


పూర్తిగా వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి అందరూ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏకదాటిన 4 గంటలకుపైగా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ముఖ్య అతిథులు, వివిధ దేశాలలోని నాయకులందరూ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకోవాలని అభిలషించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని, అలాగే భావితరాలకు వేసిన పునాదులను మరిత పటిష్టం చేయాలని కోరారు. అమరావతి లాంటి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు కంప్లీట్ అవాలన్నా మళ్లీ చంద్రబాబే ముఖ్యమంతి అవ్వాలని మనసారా కోరుతున్నట్టు తెలిపారు.  ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని దేవుళ్ళను ప్రార్థించారు. 

Updated Date - 2021-04-21T23:24:11+05:30 IST