Kuwait: 7 లక్షల 50 వేల మంది వలసదారులకు భారీ షాక్.. ఉద్యోగాల్లోంచి తొలగించి ఇంటికి పంపనున్న కువైత్

ABN , First Publish Date - 2022-08-23T14:54:16+05:30 IST

స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో కువైత్ ప్రభుత్వం (Kuwait Govt) గత కొంతకాలంగా ప్రవాసులపై వేటు వేస్తున్న విషయం తెలిసిందే.

Kuwait: 7 లక్షల 50 వేల మంది వలసదారులకు భారీ షాక్.. ఉద్యోగాల్లోంచి తొలగించి ఇంటికి పంపనున్న కువైత్

కువైత్ సిటీ: స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో కువైత్ ప్రభుత్వం (Kuwait Govt) గత కొంతకాలంగా ప్రవాసులపై వేటు వేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అన్ని కీలక శాఖల్లో ప్రవాస ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కువైటీలకు అవకాశం ఇస్తోంది. దీనికోసం అక్కడి సర్కార్ 2017 నుంచి కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy)ని అమలు చేస్తోంది. ఈ పాలసీ ద్వారా ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రవాస ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా కువైత్ (Kuwait) మరో సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నాటికి ఏకంగా ఏడున్నర లక్షల మంది వలసదారులను (Expats) ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. అయితే, వారందరూ ఈజిప్ట్ (Egypt) దేశానికి చెందిన ప్రవాస కార్మికులు కావడం గమనార్హం. 


వీరిలో వచ్చే నెల చివరి వరకు 2.50లక్షల మందిని తొలగించనుంది. అలాగే వచ్చే ఏడాది నాటికి మరో 5లక్షల మంది వరకు ఈజిప్టియన్లపై వేటు వేయనుంది. ఇలా మొత్తంగా 7.50లక్షల మంది ఈజిప్ట్ కార్మికులకు ( Egyptian workers) ఉద్వాసన పలికేందుకు కువైత్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇదిలాఉంటే.. కువైత్ వర్క్‌ఫోర్స్‌లో 77.7 శాతం మంది ప్రవాస కార్మికులుంటే.. మిగిలిన 22.3 శాతం మాత్రమే కువైటీలు ఉన్నారని ఆ దేశ అడిట్ బ్యూరో (State Audit Bureau) గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 24శాతం కార్మికులతో ఈజిప్ట్ (Egypt) తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ 23.7శాతం వర్కర్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో అత్యధిక విదేశీ వర్క్‌ఫోర్స్ కలిగిన ఈజిప్ట్ కార్మికులను తగ్గించేపనిలో కువైత్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.   


Updated Date - 2022-08-23T14:54:16+05:30 IST