12వేల మంది బ్యాచిలర్లను ఖాళీ చేయించిన Kuwait మున్సిపల్ అధికారులు.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2022-01-23T16:28:23+05:30 IST

కువైత్‌లోని బ్నీద్ అల్ గర్ ప్రాంతం నుంచి భారీ మొత్తంలో బ్యాచిలర్లను ఖాళీ చేయించారు అక్కడి మున్సిపల్ అధికారులు.

12వేల మంది బ్యాచిలర్లను ఖాళీ చేయించిన Kuwait మున్సిపల్ అధికారులు.. ఎందుకంటే..?

కువైత్ సిటీ: కువైత్‌లోని బ్నీద్ అల్ గర్ ప్రాంతం నుంచి భారీ మొత్తంలో బ్యాచిలర్లను ఖాళీ చేయించారు అక్కడి మున్సిపల్ అధికారులు. గత 16 నెలల్లో ఏకంగా 12వేల మందికి పైగా బ్యాచిలర్లను ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించినట్లు మున్సిపాలిటీ హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ బృందం-క్యాపిటల్ గవర్నరేట్ మున్సిపాలిటీ బ్రాంచీ జైద్ అల్ ఎనాజీ వెల్లడించారు. వీరంతా కొంతకాలంగా మున్సిపాలిటీ నిబంధనలను ఉల్లంఘించి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ఇక 16 నెలల్లో 12వేల మందికి పైగా అంటే నెలకు సగటున 750 మంది. రోజువారీగా చూసుకుంటే 25 మంది బ్యాచిలర్లను ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. అలాగే వీరికి ఇళ్లను అద్దెకు ఇచ్చిన 220 భవన యజమానులపై పలు ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. క్యాపిటల్ గవర్నర్ షేక్ తలాల్ అల్ ఖలేద్ ఆధ్వర్యంలో క్యాపిటల్ ఎమర్జెన్సీ బృందం, విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖలోని జ్యూడిషియల్ పోలీసు టీమ్ సహకారంతో తనిఖీలు నిర్వహించి నివాస ఉల్లంఘనలకు పాల్పడిన బ్యాచిలర్లను ఖాళీ చేయించినట్లు జైద్ అల్ ఎనాజీ వెల్లడించారు.  


Updated Date - 2022-01-23T16:28:23+05:30 IST