YSR Vardhanthi.. వైయస్సార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేవీపీ

ABN , First Publish Date - 2022-09-02T18:40:10+05:30 IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా, అంపాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

YSR Vardhanthi.. వైయస్సార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేవీపీ

కృష్ణా జిల్లా (Krishna Dist.): వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి (YSR Vardhanthi) సందర్భంగా కృష్ణా జిల్లా, అంపాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీ (KVP Ramachandrarao)రామచంద్రరావు చీరెలు, పంచెలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని కేవీపీ గుర్తు చేసుకున్నారు. ‘‘వైయస్సార్‌తో నాకు ఉన్న అనుబంధం అనిర్వచనీయం.. మా ‌ఇంట్లో శుభకార్యం, అశుభకార్యం జరిగినా వచ్చే వాళ్లు.. మా గ్రామం అభివృద్ధికి ఎంతో సహకరించారు. పోలవరం పూర్తి చేసే సామర్థ్యం ఒక్క‌ వైఎస్సార్‌కే ఉందని మా నాన్న చెప్పే వాళ్లు. నా తండ్రి చనిపోయిన సమయంలో కుడా ఆ మాటలు గుర్తు చేసుకున్నారు.. కానీ విధి రాతను ఎవరూ మార్చలేరని వైఎస్సార్ ఉదంతంతో అర్ధమైంది.. ఆనాడు హెలికాప్టర్ అదృశ్యం అయితే.. వెనక్కి వస్తాడని ఆశించాం.. కానీ దేవుడు ... దేవుడు లాంటి రాజశేఖరరెడ్డిని తన వద్దకు తీసుకెళ్లిపోయాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు.. విచార దినం రోజు.. ఆ మహనీయుడు సేవలను గుర్తు చేసుకున్నాం.. ఆయనతో అనుబంధం ఉన్న వారంతా  వైఎస్సార్‌ను ప్రతి రోజు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. వైఎస్సార్ జీవితం ఆధారంగా ఓ సాహసి ప్రయాణం పుస్తకం ఆవిష్కరిస్తున్నాం. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు’’ అని కేవీపీ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-02T18:40:10+05:30 IST