క్వినోవా ఖీర్‌

ABN , First Publish Date - 2021-05-08T18:12:52+05:30 IST

క్వినోవా - 200 గ్రాములు, నెయ్యి - 80 ఎంఎల్‌, పాలు - 60ఎంఎల్‌, పంచదార - 100గ్రాములు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - చిటికెడు, పిస్తా పలుకులు - 20గ్రాములు.

క్వినోవా ఖీర్‌

క్వినోవాలో పోషకాలు.. (100గ్రాలలో..)

క్యాలరీలు - 120

ప్రొటీన్లు - 4.4 గ్రా 

కార్బోహైడ్రేట్లు - 21.3గ్రా

ఫైబర్‌ - 2.8 గ్రా


కావలసినవి: క్వినోవా - 200 గ్రాములు, నెయ్యి - 80 ఎంఎల్‌, పాలు - 60ఎంఎల్‌, పంచదార - 100గ్రాములు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - చిటికెడు, పిస్తా పలుకులు - 20గ్రాములు.


తయారీ విధానం: ముందుగా క్వినోవాను నీళ్లలో రెండు సార్లు కడగాలి. తరువాత పావుగంటపాటు నానబెట్టాలి. పదిహేను నిమిషాల తరువాత నీళ్లు వంపేసి క్వినోవా పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై కుక్కర్‌పై పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక క్వినోవా వేయాలి. చిన్నమంటపై ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు పాలు, తగినన్ని నీళ్లు పోయాలి. కుక్కర్‌ మూతపెట్టి రెండు, మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత మూత తీసి కుంకుమపువ్వు వేయాలి. మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం చిక్కబడుతున్న సమయంలో పంచదార వేసి చిన్నమంటపై మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉంచి దింపుకోవాలి. పిస్తా పలుకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-05-08T18:12:52+05:30 IST