రైతులపై లాఠీచార్జి అన్యాయం

ABN , First Publish Date - 2020-11-28T05:30:00+05:30 IST

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ 250 రైతు సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారని, అయితే రైతులపై ్ఝ్ఝ్ఞ్ఞఅన్యాయంగా లాఠీచార్జి చేశారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ అన్నారు.

రైతులపై లాఠీచార్జి అన్యాయం
కర్నూలులో నిరసన తెలుపుతున్న సీఐటీయూ, రైతు సంఘాల నాయకులు

  1. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌


కర్నూలు(న్యూసిటీ), నవంబరు 28: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ 250 రైతు సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారని, అయితే రైతులపై ్ఝ్ఝ్ఞ్ఞఅన్యాయంగా లాఠీచార్జి చేశారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ అన్నారు. లాఠీచార్జికి నిరసనగా శనివారం సుందరయ్య కూడలిలలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. గఫూర్‌ మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై భాష్పవాయువు గోళాలు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి లాఠీచార్జి చేయడాన్ని అందరూ ఖండించాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌, రామాంజనేయులు, పుల్లారెడ్డి, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


 ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు సీపీఐ, ప్రజాసంఘాలు సంఘీభావం తెలుపుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు తెలిపారు. కర్నూలులోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సంఘీబావ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 70 శాతం కీలకపాత్ర పోషించే వ్యవసాయ రంగంలో రైతులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను అమలు చేయడం దారుణమన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ఎన్‌.రసూల్‌, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

 

కోసిగి: నూతన వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. వీరేష్‌, పూజారి శ్రీనివాసులు, గోపాల్‌, మల్లికార్జున మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న పోరాటాలకు సంఘీభావంగా నేడు దర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించేలా, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేందుకే చట్టాలు తీసుకువచ్చిందని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని ఒత్తిడి తెచ్చినా, 11 రాష్ట్రాలు వ్యతిరేకించాయని, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. జీవో 22ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మిక సంఘం నాయకులు సిద్దప్ప, గోవిందు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రాజు తదితరులు ఉన్నారు.



Updated Date - 2020-11-28T05:30:00+05:30 IST