ltrScrptTheme3

పుడుతూనే పోరాడుతున్న ఓ పసివాడి ప్రాణం

Jan 30 2021 @ 13:00PM

"ఈ లోకంలోకి అడుగుపెడుతూనే జీవితం కోసం పోరాడుతున్న నా చిన్నారి బాబును ఒక్కసారంటే ఒక్కసారైనా చూడాలని తపించిపోతూ ఎన్ఐసీయూ బయట నిరీక్షిస్తున్నాను. నా పసివాడి ఆరోగ్యమే నాకు పదే పదే గుర్తుకొస్తూ చివరికి తినడం, నిద్రపోవడం కూడా మర్చిపోతున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ వాడి పరిస్థితి దిగజారిపోతోంది. వాడికి మేము ఎలాంటి సహాయమూ చెయ్యలేకపోతున్నాం. బాబుకు నా అవసరం ఎంతో ఉన్న ఈ పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేకపోతున్న నా పరిస్థితిని నేనే నిందించుకుంటున్నాను"... ఇదీ కన్నతల్లి రజిత ఆవేదన.


కరుణాకర్, రజిత జంటకు 2014లో వివాహమై 4 ఏళ్ల చిన్నారికి జన్మనిచ్చారు. 2020లో ప్రపంచమంతా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో వారు మరో బాబుకు జన్మనిచ్చి కనకట్ల అనే పేరు పెట్టారు. అయితే, నెలలు నిండక ముందే పుట్టడంతో వారి ఆకాంక్షలు తల్లకిందులయ్యాయి. ఆ పసివాడికి అవయవాలు పూర్తి స్థాయిలో ఏర్పడక పలు సమస్యలకు దారి తీసింది. దాంతో ఆ పసివాడిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఎన్ఐసీయూకి తరలించారు.

ఆ చిన్నారిని ఆసాంతం పరీక్షించిన డాక్టర్లు, పరిస్థితిని వివరించారు.... నెలలు నిండక ముందే పుట్టడం వల్ల రజిత బిడ్డకు పొత్తికడుపు ఎడమవైపు భాగంలో పుండ్లు పడ్డాయని... కాళ్ళు, దిగువ పొత్తికడుపు గోడల వద్ద రక్తనాళాలు ఉబ్బి ద్రవాలు బయటకు రావడం లాంటి తీవ్ర సమస్యలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఇది ప్రాణాంతకమైన సమస్య కావడంతో త్వరగా చికిత్స చెయ్యాలని సూచించారు.


డాక్టర్లు చెప్పిన విషయాలతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలినంత పనైంది. వారెంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. వారికి తెలిసిందల్లా తమ పిల్లవాడు ప్రమాదంలో ఉన్నాడని మాత్రమే. అయితే, ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఏమి చెయ్యలేని నిస్సహాయత. ఉన్న డబ్బంతా రజిత గర్భిణిగా ఉన్నప్పుడు పరీక్షలకు, మందుల వాడకానికి ఖర్చు పెట్టడంతో తమ పిల్లవాడి వైద్యం కోసం చేతుల్లో చిల్లిగవ్వ లేని పరిస్థితి. 


ముఖ్యంగా లాక్‌డౌన్ పరిస్థితి ఆ తల్లిదండ్రుల పట్ల మరింత క్రూరంగా మారింది. కరుణాకర్, రజితలకు పనే దొరకలేదు. కిందటి నెలలో మాత్రమే కరుణాకర్‌కి దినసరి కూలీగా పని దొరికింది. దాంతో వచ్చే సొమ్ము కాస్తా తన భార్య, బిడ్డలను పోషించుకోవడానికి మాత్రమే సరిపోతుంది. వారికిప్పుడు ఎవరూ డబ్బు లేదా అప్పు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు.


ఈ పేద తల్లిదండ్రులకు బంధువుల నుంచి సహాయం అందే అవకాశాలు గాని, పోనీ నగలమ్మి డబ్బు సమకూర్చుకునే వీలు గాని లేదు. తమ పసివాడు బాధపడుతుంటే ప్రతి రోజూ వేదనతో నిస్సహాయంగా చూస్తూ ఏదైనా ఒక అద్భుతం జరగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నారు.


ఈ కష్టకాలంలో కరుణాకర్, రజితల పసివాడికి సాయం చెయ్యగలిగేది మీరు మాత్రమే.... మీ సహాయంతో మాత్రమే వారు తమ చిన్నారి కనకట్ల చికిత్సకయ్యే ఖర్చు భరించి, తమ పసిప్రాణాన్ని రక్షించుకోగలుగుతారు. విశాల హృదయంతో అండగా నిలిచి ఆ తల్లిదండ్రులకు తమ చిన్నారి క్షేమంగా దక్కేలా చూడండి. వారు తమను తాము క్షమించుకోలేని పరిస్థితిని రానివ్వకండి.

Follow Us on:

జాతీయం మరిన్ని...

చిత్రజ్యోతి మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.