United Kingdom: డెంటిస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఆ మహిళ ఏం చేసిందంటే.. ఏకంగా 13 పళ్లు..

ABN , First Publish Date - 2022-07-23T03:06:39+05:30 IST

బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ స్వయంగా తన దంతాలను పీకేసుకుంది

United Kingdom: డెంటిస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఆ మహిళ ఏం చేసిందంటే.. ఏకంగా 13 పళ్లు..

బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ చాలా కాలంగా చిగుళ్ల వ్యాధి (chronic gum disease) తో బాధపడుతోంది.. అయితే ఉచితంగా చికిత్స చేసే ఎన్‌హెచ్‌ఎస్‌ (National Health Service) డెంటిస్ట్‌ ఏడేళ్ల క్రితమే క్లినిక్‌ను మూసివేసి వెళ్లిపోయాడు.. ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకునే స్థోమత ఆమెకు లేదు.. దీంతో ఆమె పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఎంతో కాలం దంతాల సమస్యను భరించింది..  చివరకు ఆ బాధ తట్టుకోలేక స్వయంగా తన దంతాలను పీకేసుకుంది.. అలా ఏకంగా 13 పళ్లను బయటకు లాగేసింది. 


ఇది కూడా చదవండి..

Ambulance Accident: టోల్‌బూత్‌ను ఢీ కొట్టిన అంబులెన్స్.. షాకింగ్ వీడియో వైరల్


బూరి సెయింట్స్ ఎడ్మండ్స్‌కు చెందిన డేనియల్ వాట్స్ అనే 42 ఏళ్ల చాలా కాలంగా చిగుళ్ల వ్యాధితో బాధపడుతోంది. ఎన్‌హెచ్‌ఎస్‌ డెంటిస్ట్‌ అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లేంత డబ్బులు లేకపోవడంతో ఆమె పంటి బిగువన బాధను భరించింది. `ఈ బాధతోనే రోజులు గడుపుతున్నా. పెయిన్‌కిల్లర్స్‌ తీసుకుంటూ పనికి వెళ్తున్నా. నా పిల్లలతో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నా. తెలిసివారిని కూడా నవ్వుతూ పలకరించలేకపోతున్నాన`ని వాట్స్ చెప్పింది. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్‌ కాటీ పార్కర్‌ వాట్స్ చికిత్సకు అవసరమయ్యే 1500 పౌండ్లు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు.


వాట్స్ ఇప్పటికే ఇప్పటికే 14 పళ్లను తొలగించుకున్నారు. మరో 8 దంతాలు తొలగించాల్సి ఉంది. ఆ తర్వాత ఆమెకు కొత్తగా దంతాలు అమర్చాలి. అందుకు అవసరమయ్యే డబ్బును సమకూర్చేందుకు ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చాలా మంచి స్పందన లభిస్తోంది. తన కోసం విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యంలో వాట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. 

Updated Date - 2022-07-23T03:06:39+05:30 IST