మద్యంపై హద్దులేవీ?

ABN , First Publish Date - 2020-10-21T06:48:45+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో మద్యం అమ్మకాలపై పర్యవేక్షణ కరువైంది. బెల్ట్‌ షాప్‌లపై నియంత్రణ లేదు. మద్యం అమ్మ కాలు విచ్చలవిడిగా చేస్తున్నారు

మద్యంపై హద్దులేవీ?

నిజామాబాద్‌ జిల్లాలో మద్యం అమ్మకాలపై  అధికారుల పర్యవేక్షణ కరువు

విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలు

కరోనా నిబంధనలు పాటించని యజమానులు

నగరంలోని గల్లీల్లో వెలిసిన బెల్ట్‌షాపులు

‘మామూలు’గా తీసుకుంటున్న ఎక్సైజ్‌ అధికారులు


నిజామాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలో మద్యం అమ్మకాలపై పర్యవేక్షణ కరువైంది. బెల్ట్‌ షాప్‌లపై నియంత్రణ లేదు. మద్యం అమ్మ కాలు విచ్చలవిడిగా చేస్తున్నారు. మద్యం షాపుల వద్ద ఎగబ డి మద్యం కొంటున్నా పట్టించుకోవడం లేదు. కొవిడ్‌ నిబంధ నల అమలు లేదు. నగరం పరిధిలోని మద్యం షాపులు అధి కారుల కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్నా తనిఖీ లు నిర్వహంచడం లేదు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం ఉండే విధంగా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గద ర్శకాలు విడుదల చేసినా ఇక్కడ అమలు చేయడం లేదు. మ ద్యం షాపుల యజమానులతో స్టేషన్ల వారీగా ఉన్న సత్సం బంధాలతో మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతు న్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో గల్లీలు మద్యం అడ్డాలుగా తయారయ్యాయి.


జిల్లాలో మొత్తం 93 మద్యం షాపులు 

జిల్లాలో మొత్తం 93 మద్యం షాపులు ఉన్నాయి. నగరంతో పాటు మండలాల పరిధిలో ఈ షాపులు ఉన్నాయి. కరోనా సమయంలో నెలన్నర వరకు మూసివేసినా ఆ తర్వాత లాక్‌ డౌన్‌ నిబంధనలను అనుసరించి తెరిచారు. కొవిడ్‌ నిబంధన లను ఆచరించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ మద్యం షాపు వద్ద శానిటైజర్లలను అందుబాటులో ఉంచాలన్నారు. మాస్కు లు తప్పనిసరి ధరించాలని కోరారు. జిల్లా పరిధిలోని మద్యం షాపులలో కొన్ని రోజుల పాటు కొవిడ్‌ నిబంధనలను పాటిం చారు. భౌతిక దూరం పాటించే విధంగా చూశారు. ప్రస్తుతం జిల్లాలోని మెజారిటీ మద్యం షాపుల పరిధిలో అవే వి అమలు కావడం లేదు. కొవిడ్‌ 


నిబంధనలను పాటించడం 

లేదు. నగరంలోని ఏ మద్యం షాపు చూసినా ఎగబడి మద్యం కొనుగోలు చేస్తున్నారు. కొంత మందికి మా స్కులు లేకున్నా అమ్మకాలు చేస్తున్నారు. మద్యం అమ్మకాల పై దృష్టి పెట్టిన షాపుల యజమానులు అవేమీ పట్టించుకోవ డం లేదు. పండుగ సీజన్‌ కావడంతో మందు కోసం ఎక్కువ మంది వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కరోనా తీవ్రత ఇంకా జిల్లాలో తగ్గలేదు. రోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నగరం పరిధిలో ఇ ప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. 


జోరుగా బెల్ట్‌ షాపులు

జిల్లాలో ప్రతీ మద్యం షాపు ఏరియాలో బెల్ట్‌ షాపులు మ ద్యం షాపులలాగానే నడుస్తున్నాయి. జిల్లాలోని గ్రామాలు, కొ న్ని గల్లీలలో ఇవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గ్రామాల పరిధిలో గ్రామాభివృద్ధి కమిటీల అనుమతితో ఇవి నడుస్తు న్నాయి. నెలకు లక్షల రూపాయల మద్యం అమ్మకాలు జరు గుతున్నాయి. వీటిలో ఎక్కువ రేటుకు మద్యం అమ్మకాలు జ రుగుతున్నా పట్టించుకునే వారే లేరు. మద్యం అమ్మకాలే టా ర్గెట్‌గా ఉన్న అధికారులు ఈ బెల్ట్‌ షాపులను పట్టించుకోవ డం లేదు. తమకు రావాల్సిన కోటా నెలనెలా వస్తుండడంతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోకపోవడం వల్ల బెల్ట్‌షాపులు యథేచ్ఛగా కొ నసాగుతున్నాయి. ఎవరైనా వీటిపై గానీ, మద్యం షాపులపై గానీ ఫిర్యాధు చేస్తే తమకు ఇచ్చిన అమ్మకాల టార్గెట్‌ చెప్పి తప్పించుకుంటున్నారు. ఏ మద్యం షాపు పరిధిలోనూ అమ్మ కాలను పట్టించుకోవడం లేదు. 


కల్లు డిపోలదీ ఇదే పరిస్థితి

జిల్లాలో కల్లు అక్రమ రవాణా కూడా యథేచ్ఛగా సాగుతు న్నా ఎక్సైజ్‌ అధికారులు దృష్టి సారించడం లేదు. జిల్లాలో కొ న్ని కల్లు డిపోల పరిధిలో అనుమతి తీసుకున్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కల్లు తీసుకవచ్చి నగరం పరిధిలో అమ్ముతున్నా పట్టించుకోవడం లేదు. కృత్రిమ కల్లు తయారు చేసే అల్ఫాజోలమ్‌, డైజోఫామ్‌ వం టి కెమికల్స్‌ అక్రమంగా జిల్లాకు వస్తున్నా చూ సీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని సా ర్లు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వచ్చి పట్టుకుంటే తప్ప వీరు కదలడం లేదు. కరోనా సమయంలో మద్యం షాపుల వద్ద నిబంధనలు పాటిస్తే కొంత మేర అరికట్టే అవకాశం ఉం ది. బెల్ట్‌ షాపులను నియంత్రిస్తే గ్రా మాలలో మద్యం అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. నగరం పరిధిలో మద్యం దుకాణాల వద్ద కొవి డ్‌ నిబంధనలు పాటించే విధంగా చూస్తున్నామని ఎక్సైజ్‌ సీఐ కమలాకర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మాత్రం ఎవరిపై కేసు నమోదు చేయలేదన్నారు. అక్రమ కల్లు రవాణా తమ దృష్టికి రాలేదని తెలిపారు. బెల్ట్‌ షాపులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2020-10-21T06:48:45+05:30 IST