సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి కరువు

ABN , First Publish Date - 2022-08-14T05:16:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు, పిల్లకాల్వ ల నిర్మాణాల పూర్తి చేసేందుకు చిత్తశుద్ధి కరువైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి కరువు
విలేకరులతో మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

వైసీపీ ప్రభుత్వంలోనే సీమకు అన్యాయం : టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు, పిల్లకాల్వ ల నిర్మాణాల పూర్తి చేసేందుకు చిత్తశుద్ధి కరువైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలోనే సీమకు అన్యాయం జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కడపలో విలేకర్ల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ ప్రాజెక్టులో నీరు నిండుగా ఉన్నా వాటిని పం ట పొలాలకు ఇవ్వలేకపోతున్నారన్నారు. రాయలసీమలో 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు ఉన్నప్పటికీ సీబీఆర్‌, పీబీఆర్‌ ప్రాజెక్టులకు నీరిచ్చామన్నారు. మూడేళ్లుగా వైసీపీ నిర్మించిన పిల్ల కాల్వలు అందుకు చేసిన ఖర్చు, ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు కేటాయించి ఖర్చు చేశా రో ఏ ప్రజాప్రతినిధికైనా చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించా రు.

వేల కోట్ల రూపాయల మేరకు జీఓలు విడుదల చేసిన రాజోలి, కుందు లిఫ్ట్‌, జొలదరాశి, ముద్దనూరులో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు ఏమయ్యాయన్నారు. ఎంపీ మిఽథున్‌రెడ్డి కంపెనీకి రూ.4500 కోట్లు కేటాయించారే తప్ప మరేమీ చేయలేదన్నారు. పలు దఫాలుగా ఽఢిల్లీకి వెళ్లిన సీఎం, ఇతర మంత్రులు, ఎంపీలు స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి గానీ, రైల్వే జోన్‌ ఏర్పాటులో ఎప్పుడైనా ప్రశ్నించారా అని అడిగారు. హడావుడిగా గండికోటలో నీరు నింపిన పాలకులు పిల్ల కా ల్వల నిర్మాణాలు లేకపోవడంతో పలు గ్రామాలను ముంచేసి, ఇచ్చిన మాట ప్రకారం పరిహారం కూడా చెల్లించలేదన్నా రు. ఏడాదికి కనీసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు.  తక్షణమే ముఖ్యమంత్రి స్పందిం చి ప్రాజెక్టుల పూర్తికి, పిల్ల కాల్వల నిర్మాణానికి ప్రత్యేక చర్య లు తీసుకుని రైతాంగాన్ని ఆదుకునేలా చూడాలని కోరారు. సమావేశంలో నగర మాజీ అధ్యక్షుడు జిలానీబాషా పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:16:11+05:30 IST