వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో లేడీస్‌కు ఇవే సౌకర్యం.. ఆనందం..

ABN , First Publish Date - 2021-05-03T13:51:14+05:30 IST

ఇటీవల కాలంలో ఎక్కువగా ఫ్యాషన్‌లో వినిపిస్తోన్న పదం.

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో లేడీస్‌కు ఇవే సౌకర్యం.. ఆనందం..

  • అథ్లీజర్‌తో ఆనందం..!
  • ఎక్కడైనా ధరించే వీలు
  • సమ్మర్‌ కలెక్షన్‌లో ప్రముఖస్థానం కల్పించిన బ్రాండ్లు


అథ్లీజర్‌.. ఇటీవల కాలంలో ఎక్కువగా ఫ్యాషన్‌లో వినిపిస్తోన్న పదం. వర్కవుట్‌ వేర్‌ను, స్ట్రీట్‌ క్లాత్స్‌, లాంజ్‌ పీసె‌స్‌తో కలిపినట్లుగా ఉండే అథ్లీజర్‌  సౌకర్యంతో పాటుగా ఫ్యాషన్‌ అనుభవాన్ని కూడా అందిస్తుందంటున్నారు కొత్తవి కోరుకునే వారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో అత్యంత అనువైన డ్రెస్సింగ్‌ ఇదంటున్నారు ఫ్యాషన్‌ అభిమానులు. గతంలో స్పోర్ట్స్‌వేర్‌ అంటే ఒక సమయంలో మాత్రమే వేసుకోవాలనుకున్నట్లుగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అథ్లీజర్‌తో ఆ హద్దులేవీ లేవనే అంటున్నారు. టీ షర్టులు, లెగ్గింగ్స్‌, రన్నింగ్‌ షార్ట్స్‌, స్నీకర్లు, ట్రాక్‌ ప్యాంట్లు, స్పోర్ట్స్‌ సాక్స్‌ వంటివి అథ్లీజర్స్‌లో ఎక్కువగా కనిపిస్తుండటం, ప్రముఖ బ్రాండ్లు సైతం తమ సమ్మర్‌  కలెక్షన్‌లో చోటు కల్పించడంతో వీటి పట్ల యువతరం మక్కువ చూపుతోంది. అదీగాక ఉదయమే రన్నింగ్‌కు వెళ్లి, అక్కడ నుంచి నేరుగా ఫ్రెండ్స్‌తో బ్రేక్‌ఫా‌స్ట్‌కు, ఆ తరువాత ఆన్‌లైన్‌లో వర్ట్యువల్‌ మీటింగ్స్‌... సాయంత్రం ఫ్యామిలీతో షికారు.. అన్నింటికీ వీటితోనే వెళ్తే అవకాశం ఉండటంతో అథ్లీజర్‌ ఇప్పుడు అత్యంత సౌకర్యవంతమైన డ్రెస్‌గా మారిపోయింది.


సౌకర్యమే మిన్న... ?!

ఒకప్పటి ఫ్యాషన్‌లు ఎలాగుండేవన్నది  అప్రస్తుతం, ఇప్పుడు మాత్రం సౌకర్యమే ప్రధానమైంది. ఈ కారణం చేతనే రోజంతా చెమట పట్టకుండా ఉంటూనే తమకు కావాల్సిన శైలి కూడా అందించాలని కొందరు కోరుకుంటున్నారు. ఇదే అథ్లీజర్స్‌ పట్ల మక్కువ పెంచుకోవడానికి కారణమైంది. దీనికి తోడు కరోనా తీసుకువచ్చిన భయాలతో ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యం కూడా పెరిగింది. యోగాతో పాటుగా పలు మార్గాలను ఇప్పుడు శరీరం ఫిట్‌గా ఉంచుకోవడానికి అనుసరిస్తున్నారు. దీనికి తోడు సౌకర్యవంతమైన వస్త్రాలతోనే ఫ్యాషన్‌ చూపగలమనే తారల ప్రకటనలు, వాటినే తమ స్టైల్‌ స్టేట్‌మెంట్స్‌గా భావిస్తుండటం కూడా వీటి పట్ల చాలా మందికి మక్కువ పెరగడానికి కారణంగా అభివర్ణిస్తున్నారు డిజైనర్లు. ఇదే విషయమై డిజైనర్‌ విద్యార్థిని శృతి మాట్లాడుతూ సౌకర్యవంతంగా ఉంటూనే ఫ్యాషన్‌గా కూడా కనిపించాలనుకునే వారికి అనువైనది అథ్లీజర్‌. - హైదరాబాద్‌ సిటీ.


అథ్లీజర్స్‌ ఎలా ధరించవచ్చంటే..

  • ఇవి క్లాసిక్స్‌ మాత్రమే కాదు, సౌకర్యవంతమైనవి కూడా! స్నీకర్లతో పాటుగా కలిపి వీటిని ధరించవచ్చు.
  • అథ్లీజర్స్‌ను ఎక్కడైనా ధరించవచ్చు కానీ మ్యాచింగ్‌ ట్రాక్‌ సూట్స్‌ ధరిస్తే ఇంకా బాగుంటుంది.
  • మీ రెగ్యులర్‌ ఫ్యాషన్‌ వార్డ్‌రోబ్‌కు బ్యాలెన్స్‌డ్‌ లుక్‌ అందించడం కోసం స్పోర్ట్స్‌ పీసెస్‌ జోడించవచ్చు.
  • లేయరింగ్‌కు వచ్చేసరికి కాస్త సృజనాత్మకంగా ఉండాలి. హై ఫెర్‌ఫార్మెన్స్‌ స్పోర్ట్స్‌ ఫ్యాబ్రిక్స్‌తో డెనిమ్‌, లెదర్‌ లాంటి వాటిని మిక్స్‌ చేయవచ్చు.
  • బ్రైట్‌ కలర్స్‌, ప్రింట్స్‌ జోలికి వెళ్లక పోవడం మంచిది. అలాగే స్నీకర్లు, స్లైడ్స్‌ను ఫుట్‌వేర్‌గా ధరించాలి.
  • అథ్లీజర్‌ లుక్‌ అతి సులభంగా పొందాలనుకుంటే, క్రాప్‌ టాప్‌ను హై వెయిస్టెడ్‌ ప్యాంట్లతో జత చేయాలి.
  • నడుం దగ్గర ప్లెయిడ్‌ షర్ట్‌ లేదంటే ఏదైనా బాటమ్‌ డౌన్‌ ధరించడంతో పాటుగా బేస్‌బాల్‌ క్యాప్‌, లెగ్గింగ్స్‌, స్నీకర్లు ధరిస్తే బాగుంటుంది. 
  • లో కట్‌ షర్ట్‌, స్ట్రాపీ బ్రాలెట్‌తో వర్కవుట్స్‌ ప్యాంట్లు, స్నీకర్లకు మరింత గ్లామర్‌ జోడించవచ్చు. నిజానికి అథ్లీజర్‌ ట్రెండ్‌ను అనుసరించినప్పుడు మరింత అందంగా కనిపించాలంటే సరైన యాక్ససరీలు ధరించడం అవసరం. చేతిలో గ్లామరస్‌ బ్యాగ్‌ ఉన్నా చాలు..!.

Updated Date - 2021-05-03T13:51:14+05:30 IST