సెలవు కావాలంటే లాడ్జికి రావాలా..?

ABN , First Publish Date - 2022-06-02T16:53:14+05:30 IST

క్రమశిక్షణకు మారుపేరైనా పోలీసుశాఖలో మహిళా ఉద్యోగుల పట్ల ఓ కామాంధుడు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకే మచ్చ తెచ్చే విధంగా మారింది. సెలవు కోరితే లాడ్జికి వచ్చి బట్టలు

సెలవు కావాలంటే లాడ్జికి రావాలా..?

- కొప్పళ ఎస్పీ కార్యాలయంలో ఓ అధికారి నిర్వాకం

- మహిళా సిబ్బంది ఆవేదన


బెంగళూరు: క్రమశిక్షణకు మారుపేరైనా పోలీసుశాఖలో మహిళా ఉద్యోగుల పట్ల ఓ కామాంధుడు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకే మచ్చ తెచ్చే విధంగా మారింది. సెలవు కోరితే లాడ్జికి వచ్చి బట్టలు తీయాలంటూ కొప్పళ ఎస్పీ కార్యాలయంలో సహాయ పాలనాధికారి వేధిస్తున్నాడని మహిళా సిబ్బంది ఆరోపించారు. కొప్పళ ఎస్పీ కార్యాలయంలో డి గ్రూప్‌ ఉద్యోగులను పాలనాధికారి మల్లినాథ్‌ విపరీతంగా వేధిస్తున్నాడనే విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. గతంలో సీసీ కెమెరాల ఆధారంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ప్రత్యేకించి కారుణ్య నియామకాలలో చేరిన వారిని వేధిస్తున్నాడనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. సెలవు కోరితే ముద్దు ఇస్తావా... అయినా భర్త లేడు నీకు సెలవెందుకు..? అంటూ వే ధింపులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలు రావడంతో కొప్పళ ఎస్పీ కార్యాలయం మరోసారి వివాదంలోకి చేరింది. 2019లో ఇతడిపై ఇటువంటి ఆరోపణలు రాగా అప్పట్లో షోకాజ్‌ నోటీసు ఇచ్చి సరిపెట్టారు. మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సదరు అధికారిపై చర్యలు తీసుకుంటారో లేదా గతంలో మాదిరిగానే షోకాజ్‌తో సరిపెడతారో వేచి చూడాల్సి ఉంది. 

Updated Date - 2022-06-02T16:53:14+05:30 IST