వంటలు

లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)

లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)

కావలిసినవి: ఎగ్‌ వైట్‌ - 150 గ్రా, కాస్టర్‌ షుగర్‌- 75గ్రా, మైదా- 125 గ్రా, ఐసింగ్‌ షుగర్‌ -65 గ్రా, కోడిగుడ్డు పచ్చసొన - 65 గ్రా, పంచదార - 100గ్రా. 


తయారీ విధానం: ముందుగా ఎగ్‌ వైట్‌, షుగర్‌ కలిపి, దానిలో కోడిగుడ్డు పచ్చసొన కూడా వేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా, పంచదార కలిపి, ఎగ్‌ మిక్సర్‌తో కలపాలి. ఈ మిక్సర్‌ను ట్రేలో వేసి, ఐసింగ్‌ షుగర్‌ చల్లి 12 నిమిషాల పాటు 180 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వద్ద బేక్‌ చేసుకుంటే లేడీ ఫింగర్స్‌ రెడీ. Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.