అమ్మకు పరీక్ష

ABN , First Publish Date - 2022-06-22T06:44:12+05:30 IST

నిరుపేదలకు వైద్యసేవలందించేందుకు సర్కారు కోట్ల రూపా యలు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేయకపోవడం నిర్లక్ష్యం వెరసి రోగులకు శాపంగా మారుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం.

అమ్మకు పరీక్ష
ఆస్పత్రి ఎదుట గర్భిణులు

రేడియాలజిస్ట్‌ లేకపోవడంతో

సహనం నశించి ఆసుపత్రిలో గర్భిణుల ఆందోళన

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 21: నిరుపేదలకు వైద్యసేవలందించేందుకు సర్కారు కోట్ల రూపా యలు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేయకపోవడం నిర్లక్ష్యం వెరసి రోగులకు శాపంగా మారుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. మంగళవారం మాతాశిశు కేంద్రంలో ఉదయం 11గంటల వరకు మాత్రమే రేడియాల జిస్ట్‌ అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్లిపోవడంతో రెండు రోజులుగా ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు ఉదయం నుంచి తమ వంతు కోసం నిరీక్షించి.. నిరీక్షించి .. నీరసించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. జిల్లా ఆస్పత్రిలోని మాతాశిశు కేంద్రంలో రెండు స్కానింగ్‌ యంత్రాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక్క రేడియాలజిస్ట్‌ ఉన్నారు. ప్రతి నిత్యం కనీసం 200 నుంచి 300 వరకు గర్భిణులు ఆస్పత్రికి వస్తుంటారు. వీరికి నెలలు నిండిన గర్భిణులకు విధిగా స్కానింగ్‌ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సుమారు 130 మంది గర్భిణులు స్కానింగ్‌ కోసం వచ్చారు. ఇక్కడ రెగ్యులర్‌గా విధులు నిర్వహిస్తున్న రేడియాలజిస్ట్‌ సెలవులో వెళ్లడంతో ఓ కాంట్రాక్ట్‌ (ప్రైవేటు) రేడియాలజిస్ట్‌ను తాత్కాలింగా విధుల్లో ఉంచారు. ఆయన ఉదయం 9 గంటల నుంచి 70 మందికి స్కానింగ్‌ తీశారు. ఆ తర్వాత తనకు సమయం అయ్యిం దంటూ వెళ్లిపోయారు. దీంతో మిగిలిన 50 మంది గర్భిణులు స్కానింగ్‌ కోసం నిరీక్షించా రు. రెండు మూడు, రోజులుగా స్కానింగ్‌ కోసం వస్తున్నామని.. నిల్చొని నిల్చొని తీరా త మ వంతు వచ్చే సరికి టైం అయ్యిందని డాక్టర్‌ వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కడుపుమండిన గర్భిణులు జిల్లా ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి గర్భిణులకు సర్దిచెప్పారు. అయితే స్కానింగ్‌ మాత్రం తిరిగి రేపు (బుధవారం) రమ్మంటున్నారంటూ శాపనార్ధాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఈ విషయమై జిల్లా ఆస్పత్రి సూపరిం టెం డెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆస్పత్రిలో రెండు స్కానింగ్‌ యంత్రాలు ఉ న్న ప్పటికీ రేడియాలజిస్ట్‌లు ఒక్కరే ఉన్నారని ఆయన సెలవులో వెళ్లడంతో ఇబ్బంది తలెత్తిం దన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేడియాలజిస్ట్‌ 11 గంటల వరకు ఉం టానని చెప్పారని ఆ నిబంధనతోనే తాను వచ్చారని.. బుధవారం నుం

Updated Date - 2022-06-22T06:44:12+05:30 IST