ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీ కట్టాల్సిందే...

ABN , First Publish Date - 2022-01-22T06:26:13+05:30 IST

తీవ్ర అనారోగ్యానికి గురైన ఒక మహిళను ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు నానాపాట్లు పడ్డారు. కొంత దూరం డోలీలో మోసుకొచ్చి, గోస్తనీ నదిని దాటించి ఎస్‌.కోట తీసుకెళ్లారు.

ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీ కట్టాల్సిందే...
గంగమ్మను డోలీలో గోస్తనీ నది వద్దకు మోసుకొచ్చిన కుటుంబ సభ్యులు


కుటుంబ సభ్యులు నానాపాట్లు

అనంతగిరి రూరల్‌, జనవరి 21: తీవ్ర అనారోగ్యానికి గురైన ఒక మహిళను ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు నానాపాట్లు పడ్డారు. కొంత దూరం డోలీలో మోసుకొచ్చి, గోస్తనీ నదిని దాటించి ఎస్‌.కోట తీసుకెళ్లారు. మండలంలోని రొంపల్లి పంచాయతీ మర్రివలస గ్రామానికి చెందిన  కోటపర్తి గంగమ్మ(55) గంగమ్మ రెండు నెలల నుంచి కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నది. శుక్రవారం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రహదారి సదుపాయం లేకపోవడంతో 108 అంబులెన్స్‌ వచ్చేపరిస్థితి లేదు. దీంతో డోలీ కట్టి జీలుగులుపాడు వద్ద గోస్తనీ నది వరకు మోసుకొచ్చారు. నాటుపడవలో ఎక్కించి అవతల వైపునకు చేర్చారు. అక్కడి వాహనంలో ఎస్‌.కోట ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 


Updated Date - 2022-01-22T06:26:13+05:30 IST