లక్రాపై హత్యా నేర ఆరోపణలు

ABN , First Publish Date - 2022-06-29T09:43:21+05:30 IST

భారత హాకీ ఆటగాడు, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బీరేంద్ర లక్రా తీవ్రమైన హత్యా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

లక్రాపై హత్యా నేర ఆరోపణలు

న్యూఢిల్లీ: భారత హాకీ ఆటగాడు, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బీరేంద్ర లక్రా తీవ్రమైన హత్యా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లక్రా స్నేహితుడు ఆనంద్‌ కుమార్‌ టొప్పో గత ఫిబ్రవరిలో భువనేశ్వర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించడానికిరెండు వారాల ముందు అతడు వివాహం కూడా చేసుకున్నాడు. అయితే, తన కొడుకు మరణానికి లక్రా, అతడి స్నేహి తుడు మంజీత్‌ టిటే కారణమని ఆనంద్‌ తండ్రి బంధన్‌ టొప్పో ఆరోపించడం సంచలనంగా మారింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని.. అతడిని స్నేహితులే హత్య చేశారని బంధన్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన కొడుకు మృతి చెందిన సమయంలో లక్రా కూడా అదే ఇంట్లో ఉన్నాడని ఆరోపిస్తున్నాడు. లక్రా డీఎస్పీ ర్యాంక్‌ అధికారి కావడంతో.. అతడి పట్ల ఒడిశా పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పాడు. కాగా, బీరేంద్ర, మంజీత్‌ ఇద్దరూ కూడా ఆనంద్‌కు చిన్ననాటి స్నేహితులు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో అనుమానించ దగ్గ అంశాలేవీ లేవని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-29T09:43:21+05:30 IST