శ్రీశైలంలో లక్ష దీపోత్సవం

ABN , First Publish Date - 2021-11-30T05:28:23+05:30 IST

శ్రీశైలానికి కార్తీక మాసం నాలుగో సోమవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పాతళగంగలో స్నానమాచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

శ్రీశైలంలో లక్ష దీపోత్సవం


శ్రీశైలం, నవంబరు 29: శ్రీశైలానికి కార్తీక మాసం నాలుగో సోమవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పాతళగంగలో స్నానమాచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఉత్తర మాడవీధిలో, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపాలు వెలిగించారు. సోమవారం వర్షం కురవడంతో లక్షదీపోత్సవానికి ఆటకం కలుగుతుందని దేవస్థానం అధికారులు భావించారు. అయితే రాత్రికి వర్షం తగ్గుముఖం పుష్కరిణికి దశవిధ హారతులను ఇచ్చి లక్షదీపోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు వెలిగించారు.  త్రిశూల హారతి సమయాన పుష్కరిణి నుంచి శివలింగం ఉద్భవించిన దృశ్యం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. వేడుకలో దేవస్థానం ఈవో లవన్న, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  

మహానందిలో..

మహానంది, నవంబరు 29: కార్తీక మాసం చివరి సోమవారం మహానంది వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే దర్శనభాగ్యం కల్పించారు. తుఫాన ప్రభావంతో ఉదయం కొంతమేర రద్దీ తగ్గినా మధ్యాహ్నం నుంచి పెరిగింది. భక్తులు సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో దాతలు భక్తులకు అన్నదానం చేశారు. 




Updated Date - 2021-11-30T05:28:23+05:30 IST