ఇక ప్రతి బుధవారం సైకిల్ డే!

ABN , First Publish Date - 2022-04-06T00:01:58+05:30 IST

వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు లక్షద్వీప్ పాలనాయంత్రాంగం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి బుధవారాన్ని సైకిల్ డేగా నిర్ణయించింది.

ఇక ప్రతి బుధవారం సైకిల్ డే!

వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు లక్షద్వీప్ పాలనాయంత్రాంగం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి బుధవారాన్ని సైకిల్ డేగా నిర్ణయించింది. ఇది అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుంది. దీనిలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, బుధవారంనాడు సైకిల్ మాత్రమే ఉపయోగించాలి. ఇంటి నుంచి ఆఫీస్‌కు, ఆఫీస్ నుంచి ఇంటికి ప్రయాణించేందుకు సైకిల్ మాత్రమే వాడాలి. దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధన ఏప్రిల్ 6 నుంచి అమల్లోకొస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. లక్షద్వీప్‌లో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు దీన్ని అమల్లోకి తెచ్చారు. గత జనవరి 28న నిర్వహించిన లక్షద్వీప్ కాలుష్య నియంత్ర కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షద్వీప్ భారత కేంద్ర పాలిత ప్రాంతమనే సంగతి తెలిసిందే.

Updated Date - 2022-04-06T00:01:58+05:30 IST