లక్ష్మీమంచు సరికొత్త టాక్‌ షో 'ఆహా భోజనంబు'

Jul 10 2021 @ 14:28PM

లక్ష్మీ మంచు మరోసారి డిజిటల్‌ మీడియంలో సందడి చేయనుంది. అయితే ఈసారి రొటీన్‌కు భిన్నంగా ఓ వంట కార్యక్రమానికి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించనుండటం విశేషం. వివరాల్లోకెళ్తే.. తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా' ఓ టాక్‌ షోను స్టార్ట్‌ చేయబోతున్నారు. సాధారణంగా టాక్‌ షో అంటే సెలబ్రిటీలు వచ్చి మాట్లాడి వెళ్లిపోయే తరహాలో కాకుండా సదరు సెలబ్రిటీలతో వంటలు చేయిస్తూ వారితో మాట్లాడించనుంది లక్ష్మీ మంచు. ప్రకాశ్‌రాజ్‌, విష్ణు మంచు, అఖిల్‌ అక్కినేని, రానా దగ్గుబాటి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తరుణ్‌ భాస్కర్‌, ఆనంద్‌ దేవరకొండ, విష్వక్‌సేన్‌ వంటి స్టార్స్‌ ఈ షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. త్వరలోనే ఆహాలో ప్రసారం కాబోయే ఈ షోలో మన సెలబ్రిటీలు ఎలాంటి వంటలు చేస్తారు? ఎలాంటి కబుర్లు చెబుతారు అనే విషయాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.