వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి

ABN , First Publish Date - 2022-05-16T05:27:46+05:30 IST

నంద్యాల మద్దులేటి స్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి
నల్లకాల్వలో కల్యాణం నిర్వహిస్తున్న పురోహితులు

నంద్యాల (కల్చరల్‌) మే 15: నంద్యాల మద్దులేటి స్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా సుదర్శన హోమాన్ని నిర్వహించా రు. అమ్మవార్లకు సామూహిక ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. 


డోన్‌ (రూరల్‌): మండంలోని యాపదిన్నె గ్రామంలో మూడు రోజుల పాటు జరిగిన లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు.మూడు రోజుల పాటు జరిగిన లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం  ముగిసాయి. 


బేతంచెర్ల: మండలంలోని మద్దిలేటిస్వామి క్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకల నిర్వహించారు. స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆలయ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


 బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్‌ సమీపంలోని కొండపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జయంతిని పురస్కరించుకొని ఆదివారం అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. మహా మంగళహారతులు ఇచ్చారు. 


ఆత్మకూరు రూరల్‌: ఆత్మకూరు మండలం నల్లకాల్వలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయం చుట్టూ ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించారు.  


రుద్రవరం: మండలంలోని నరసాపురం గ్రామంలో నరసింహస్వామి జయంతి వేడుకలు ఆదివారం వైభవంగా చేపట్టారు. మూల విరాట్‌కు పంచామృతాభిషేకం చేసి ప్రత్యేక అలంకారం  చేశారు.



Updated Date - 2022-05-16T05:27:46+05:30 IST