
న్యూఢిల్లీ: షట్లర్ లక్ష్యసేన్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన కియాన్ ను 24-22, 21-17 స్కోరుతో ఓడించాడు. 30 వేల డాలర్ల ప్రైజ్ మనీ పొందాడు.
మరోవైపు మెన్స్ డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి మలేషియాకు చెందిన ఆషన్ సెతియావాన్ జోడిని 21- 16, 26- 24తో ఓడించి టైటిల్ గెలుచుకున్నారు.