అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం

ABN , First Publish Date - 2020-12-02T05:24:41+05:30 IST

నియోజకవర్గంలో తొలిసారిగా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి నిర్మల తెలిపారు.

అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం
మాట్లాడుతున్న మార్కెట్‌ కమిటీ సెక్రటరీ నిర్మల

నూతనంగా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు

మార్కెట్‌ కమిటీ స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి నిర్మల

మణుగూరుటౌన్‌, డిసెంబరు 1: నియోజకవర్గంలో తొలిసారిగా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి నిర్మల తెలిపారు. మంగళవారం మణుగూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో బూర్గంపాడు, మణుగూరు ప్రాంతాల్లో తొలిసారి రెండు కేంద్రాలను ప్రారంభించామని, మణుగూరు కేంద్రంలో ఇప్పటికే సుమారు రెండు వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఈ కేంద్రం ద్వా రా సుమారు 10 వేల క్వింటాళ్ల దాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అశ్వాపురం మండలం, లక్ష్మీపురంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామ ని, గత ఏడాదికన్నా అధికంగా పత్తి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో సొసైటీ, ఐకేపీ, జీసీసీలకు ఎలకా్ట్రనిక్‌ వెయింగ్‌ మిషన్‌లు, టార్పాలిన్‌, మాయిశ్చరైజ్‌, ధాన్యం శుభ్రం చేసే యంత్రాలను అందజేశామన్నారు. ధాన్యం కాంటా వేసిన తర్వాత మిల్లు చేరేవేసేవరకు బాధ్యత మొత్తం మార్కెట్‌ కమిటీదేనన్నారు. 

Updated Date - 2020-12-02T05:24:41+05:30 IST