లాల్‌ సింగ్‌ హంగామా మొదలు

Published: Mon, 08 Aug 2022 00:45:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లాల్‌ సింగ్‌  హంగామా మొదలు

అమీర్‌ఖాన్‌ నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. ఈనెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘లాల్‌ సింగ్‌..’ ప్రీమియర్లకు హైదరాబాద్‌ వేదిక అయ్యింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు సీనీ ప్రముఖులు లాల్‌ సింగ్‌ చద్దా వీక్షించారు. ‘‘ఇటీవల విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. కంటెంట్‌ ఉన్న చిత్రాలు వస్తే ఆదరణ తథ్యమని నిరూపించాయి. ‘లాల్‌ సింగ్‌ చద్దా’నీ తెలుగువాళ్లు ఆదరిస్తారని నమ్మకం ఉంద’’న్నారు చిరంజీవి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International