13 ఏళ్ల నాటి కేసులో Lalu prasad yadavకు జరిమానా

ABN , First Publish Date - 2022-06-08T18:55:12+05:30 IST

13 ఏళ్ల నాటి కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు జరిమానా విధించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు గాను ఆయనకు 6,000 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు జార్ఖండ్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం ప్రకటించింది..

13 ఏళ్ల నాటి కేసులో Lalu prasad yadavకు జరిమానా

పాట్నా: 13 ఏళ్ల నాటి కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి(bihar former cm) లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu prasad yadav)కు కోర్టు జరిమానా విధించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు గాను ఆయనకు 6,000 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు జార్ఖండ్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం ప్రకటించింది. 2009 నాటి ఈ కేసులో ఆయన ఎంపీ,ఎమ్మల్యే కోర్టు ముందు తాజాగా హాజరయ్యారు. ‘‘లాలూ ప్రసాద్‌ పిటిషన్‌ను విచారించిన అనంతరం ఆయనకు కోర్టు 6000 రూపాయల జరిమానా విధిస్తోంది. అంతే కాకుండా ఈ కేసు ఇంతటితో పరిష్కరించబడింది. ఈ కేసు విషయంలో లాలూ మళ్లీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు’’ అని లాలూ న్యాయవాది పేర్కొన్నారు. 2009లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లాలూ హెలికాఫ్టర్‌ను ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో కాకుండా పంటపొలాల్లో ల్యాండ్ చేయడం పట్ల కేసు నమోదైంది. ఎన్నికల నియమావళికి ఇది విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-08T18:55:12+05:30 IST