
పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)ను న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS)కు విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ఇటీవల తన నివాసంలో మెట్లపై నుంచి జారిపోవడంతో గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాయి. మరింత మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav)కు ఫోన్ చేసి లాలూ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆర్జేడీ వర్గాల కథనం ప్రకారం లాలూ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనను వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన భుజం, నడుము ఎముకలు చిట్లినట్లు వైద్యులు చెప్పారు.
ఇవి కూడా చదవండి