అబ్జర్వేషన్‌లో లాలూ.. త్వరగా కోలుకోవాలన్న నితీశ్

ABN , First Publish Date - 2021-01-25T00:56:00+05:30 IST

అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన రాజకీయ ప్రత్యర్థి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్

అబ్జర్వేషన్‌లో లాలూ.. త్వరగా కోలుకోవాలన్న నితీశ్

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన రాజకీయ ప్రత్యర్థి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ త్వరగా కోలుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకాంక్షించారు. ఆయన సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి,  ఓబీసీ నేత కర్పూరీ ఠాకూర్ జయంతి సందర్భంగా పాట్నాలో నివాళులు అర్పించిన నితీశ్ కుమార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నితీశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఠాకూర్‌ను నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ ఇద్దరూ తమ రాజకీయ గురువుగా భావించేవారు.


72 ఏళ్ల లాలు దాణా కుంభకోణంలో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేరి చికిత్స పొందుతున్నారు. అక్కడాయన పరిస్థితి మరింత క్షీణించడంతో నిన్న ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడాయనను అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2021-01-25T00:56:00+05:30 IST