జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-24T05:29:56+05:30 IST

జాతీయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమీకృత కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు

జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణను వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌


కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌



సిద్దిపేట అగ్రికల్చర్‌, సెప్టెంబరు 23 : జాతీయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమీకృత కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా మీదుగా ఎల్కతుర్తి-మెదక్‌, జనగామ-సిరిసిల్ల జాతీయ రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఎల్కతుర్తి-మెదక్‌ హైవే దాదాపు 80 కిలోమీటర్ల నిర్మించనున్నారని కలెక్టర్‌ తెలియజేశారు. అలాగే జనగామ జిల్లా నుంచి చేర్యాల, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకు సుమారు 105 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ, ఫారెస్ట్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌, రెవెన్యూ, రైల్వే శాఖల సమన్వయంతో హైవే నిర్మాణంలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా పనులు ముందుకుసాగాలని ఆయన ఆదేశించారు. పనులకు ఆటంకాలు లేకుండా ఆయా శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. 


Updated Date - 2022-09-24T05:29:56+05:30 IST