రైల్వేగేట్‌కు భూ సేకరణ

ABN , First Publish Date - 2022-05-26T06:21:18+05:30 IST

భువనగిరి అర్బన్‌ కాలనీ వాసులకు రైల్వే గేటు కష్టాలు తీరనున్నాయి. రైల్వే గేటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాం త వాసులు చేస్తున్న డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించింది. అర్బన్‌ కాలనీ నుంచి హుస్సేనాబాద్‌ మీదుగా కిసాన్‌నగర్‌, అండర్‌ పాస్‌ రైల్వే బ్రిడ్జి వరకు 30ఫీట్ల వెడల్పుతో రోడ్డు ను నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ చేయాలని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రైల్వేగేట్‌కు భూ సేకరణ

ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

తీరనున్న అర్బన్‌ కాలనీ వాసుల ఇక్కట్లు

భువనగిరి టౌన్‌, మే 25: భువనగిరి అర్బన్‌ కాలనీ వాసులకు రైల్వే గేటు కష్టాలు తీరనున్నాయి. రైల్వే గేటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాం త వాసులు చేస్తున్న డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించింది. అర్బన్‌ కాలనీ నుంచి హుస్సేనాబాద్‌ మీదుగా కిసాన్‌నగర్‌, అండర్‌ పాస్‌ రైల్వే బ్రిడ్జి వరకు 30ఫీట్ల వెడల్పుతో రోడ్డు ను నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ చేయాలని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ  చేశారు. అయితే భూసేకరణకు రెండు నెలల క్రితమే భువనగిరి మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. కాగా, మూడేళ్ల క్రితం కూడా భూసేకరణకు చేసిన ప్రయత్నాలకు భూయజమానులు అభ్యంతరం తెలపడంతో నాడు పనులు నిలిచిపోయాయి. తిరిగి భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో ఈ ప్రక్రియ ఈ సారైనా పూర్తయి రోడ్డు కష్టాలు తీరుతాయని అర్బన్‌ కాలనీ, శ్రీరాంనగర్‌, అంబేద్కర్‌నగర్‌, తదితర బస్తీ వాసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-05-26T06:21:18+05:30 IST