తహసీల్దార్‌తో సమావేశమైన ప్రజాప్రతినిధులు
సిర్పూర్(యూ), జనవరి 20: మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యంలో గురువారం తహసీల్దార్ రహీమొద్దిన్, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలుసమస్యలను తహసీల్దార్ రహీమొద్దిన్ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో చాలామంది లబ్ధిదారులకు భూమి పట్టా, విరాసత్ పట్టా కాకకపోవడంతో రైతుబంధుతోపాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మీ, జైనూర్ మార్కెట్‌కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావ్, సర్పంచులు ఆత్రం పద్మబాయి, ఆర్క హీరాబాయి తదితరులు పాల్గొన్నారు.