భూ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-07T04:54:03+05:30 IST

రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలను ప్రభుత్వ ఆదేశాలకు అణుగుణంగా తక్షణమే పరిష్కారించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అఽధికారులను కోరారు.

భూ సమస్యలు పరిష్కరించాలి
ఆర్డీవోతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేసండ్ర

 కల్లూరు ఆర్డీవోతో ఎమ్మెల్యే సండ్ర 

 15నుంచి రెవెన్యూ సదస్సులు

కల్లూరు/పెనుబల్లి/సత్తుపల్లి, జూలై 6: రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలను ప్రభుత్వ ఆదేశాలకు అణుగుణంగా తక్షణమే పరిష్కారించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అఽధికారులను కోరారు. బుధవారం కల్లూరులోని రెవెన్యూడివిజన్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర పలు మండలాలకు సంబంధించిన భూ సమస్యలపై ఆర్డీవో సూర్యానారయణతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ సహా ఆయా ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న పలు రకాల భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 15 నుంచి జరిగే రెవెన్యూ సదస్సులు ఎంతగానో దోహద పడనున్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాల రైతులు నాయకులు చీకటి రామారావు, పాయం వెంకటేశ్వరావు, దేవరపల్లి వెంకటారావు, కొరకొప్పు ప్రసాద్‌, బాబోతు బాలు పాల్గొన్నారు.

పెనుబల్లి: తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15నుంచి మండలాలవారీగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో రైతులు భూసమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. బుధవారం పెనుబల్లిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటివరకు పాస్‌పుస్తకాలు జారీ కాకుండా రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించని రైతుల భూసమస్యల పరిష్కారానికి గ్రామాలవారీగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని, వారి సమస్యలను తెలుసుకొని సదస్సుల నాటికి దరఖాస్తులను పూర్తిచేయించి అధికారులకు అందజేయడంలో కృషిచేయాలని సూచించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావ్‌, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, కారాయిగూడెం సొసైటీ అధ్యక్షుడు చింతనిప్పు సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, వీడీసీ చైర్మన్‌ ముక్కర భూపాల్‌రెడ్డి, మండ ల కార్యదర్శి భూక్యా ప్రసాద్‌, ఎంపీపీ సలహాదారు లక్కినేని వినీల్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉత్తమ విద్యార్థినులకు సండ్ర సన్మానం

సత్తుపల్లి: పది, ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలను అభినందించారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఉత్తమ మార్కులు సాధించిన, ఐదుగురు విద్యార్థినులకు ఒక్కక్కరికీ రూ.20వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించటం ద్వారా విద్యార్థినులు సత్తుపల్లికి మంచి గుర్తింపు తెచ్చారని భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా కార్పొరేట్‌ స్థాయిలో ఉత్తమ ఫలితా లు సాధించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, పలువురు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T04:54:03+05:30 IST